వారాణసిలో బీజేపీ ఓటమి
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:58 AM
ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న వారాణసి నియోజకవర్గం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రధాని మోదీపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు
మోదీపై వ్యతిరేకతకు నిదర్శనం
పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
ఢిల్లీ ర్యాలీకి పార్టీ శ్రేణులను ఎలాగైనా తరలిస్తామని స్పష్టత
హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న వారాణసి నియోజకవర్గం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రధాని మోదీపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతారాలు సృష్టించినా.. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నవంబరు 1న తలపెట్టిన ర్యాలీకి తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులను తరలిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీ, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రె్‌సను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చేసిన పోస్టుపై తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీకి మీడియా ఫోబియా ఉందని, విలేకరుల సమావేశం పెట్టే దైర్యం లేని ఆయన.. ఎక్స్‌లో వెకిలిగా పోస్టు చేసి ప్రధాని హోదాను దిగజార్చారన్నారు. వారాణసి లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి గెలిచారని టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా చెప్పారు. ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ సొంత నగరం నాగ్‌పూర్‌లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని తెలిపారు. రక్షణ శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న లఖ్‌నవూ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ సొంతం చేసుకుందన్నారు.
ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజకీయ ప్రాబల్యం ఉన్న పట్నాలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. కర్ణాటక ఫలితాలు చూపి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అవుతుందని అంటున్న బీజేపీ నేతలు.. వారాణసి, నాగ్‌పూర్, ఫలితాలపై ఏమంటారని ప్రశ్నించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబరు 1న ఇండి కూటమి తలపెట్టిన ర్యాలీకి వచ్చే కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం రైళ్లు కేటాయించడం లేదని ఆరోపించారు. అమిత్ షా రాకతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఇక, ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తుల అంశంలో రాజకీయాలు చేయడం తగదని హరీశ్‌రావుకు హితవు పలికారు. కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటుందని, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల అంశం టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ పర్యవేక్షిస్తుందని టీపీసీసీ చీఫ్ చెప్పారు.
మోదీకి గుణపాఠం : మల్లు రవి
దేశవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, ప్రధాని మోదీకి ప్రజలు చెప్పిన గుణపాఠమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి విమర్శించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారాణసిలో రెండుచోట్లా బీజేపీ ఓడిపోవడం, చివరికి ఆర్‌ఎ్‌సఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్లోనూ ఘోర పరాజయం పాలుకావడం బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి నిదర్శనమన్నారు. ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేశాయన్నారు
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు