Share News

ప్రపంచ సమస్యలకు ‘భారత్‌ సమ్మిట్‌’లో పరిష్కారాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:35 AM

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషించే వేదికగా ‘భారత్‌ సమ్మిట్‌--2026’ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ సమస్యలకు ‘భారత్‌ సమ్మిట్‌’లో పరిష్కారాలు
bharatsummit

  • ప్రపంచ ఆర్థికవ్యవస్థ, ఏఐ, వాతావరణ మార్పులపై కీలక చర్చలు

  • సదస్సు స్వాగత కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషించే వేదికగా ‘భారత్‌ సమ్మిట్‌--2026’ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు, మేధావులు వీటిపై చర్చించడం ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనే అవకాశం ఉంటుందన్నారు. గురువారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ‘భారత్‌ సమ్మిట్‌- 2026’ స్వాగత కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.. దీనితోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఏఐ, వాతావరణ మార్పులపై సదస్సులో కీలక చర్చలు జరగనున్నట్టు మంత్రి ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఆలోచనల స్ఫూర్తితో, సల్మాన్‌ ఖుర్షీద్‌ మార్గదర్శకత్వంలో రెండ్రోజుల పాటు భారత్‌ సమ్మిట్‌ను రెండో ఏడాదీ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ‘ఇండియా అండ్‌ ది వరల్డ్‌’ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు హాజరవుతారని, అదే రోజు ‘అవర్‌ వరల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ను కూడా ప్రారంభించనున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 04:36 AM