Share News

సుప్రీంకోర్టులో నిర్మాత బండ్ల గణేష్‌కు చుక్కెదురు

ABN , Publish Date - Jul 23 , 2026 | 02:53 PM

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది..

సుప్రీంకోర్టులో నిర్మాత బండ్ల గణేష్‌కు చుక్కెదురు
Supreme Court

హైదరాబాద్, జులై 23: సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు సుప్రీం కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సినీ నిర్మాత బండ్ల గణేష్ దాఖలు చేసిన కీలక పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జూబ్లీహిల్స్‌లోని తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. యూనియన్ బ్యాంక్ చేపట్టిన వేలం ప్రక్రియను సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్ తీసుకున్న రుణాలకు బండ్ల గణేష్ కుటుంబం హామీదారులుగా ఉన్న నేపథ్యంలో సర్ఫేసీ చట్టం కింద బ్యాంక్ 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకుని, 2022లో వేలం నిర్వహించి రూ.8.51 కోట్లకు విక్రయించింది.


ఈ వ్యవహారంలో మొదట రుణ వసూళ్ల ట్రిబ్యునల్ వేలాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ తీర్పును యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా.. బ్యాంక్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు డీఆర్టి నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎన్సీఎల్టీలో దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నందున వేలం చెల్లదని బండ్ల గణేష్ వాదించినా.. అది కంపెనీ ఆస్తి కాదని, హామీదారుల వ్యక్తిగత ఆస్తులపై నిషేధం ఉండదని యూనియన్ బ్యాంక్ వాదించింది. ఈ వాదనలను సమర్థించిన హైకోర్టు తీర్పుపై బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు.


ఇవీ చదవండి:

ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న యువతి.. వీడియో వైరల్

ఢిల్లీలో మళ్లీ హింసాత్మక ఘర్షణలు.. పోలీసులపై రాళ్లురువ్విన నిరసనకారులు

Updated Date - Jul 23 , 2026 | 03:24 PM