15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్..
ABN , Publish Date - Jul 19 , 2026 | 09:13 PM
తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాభివృద్ధి పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..
హైదరాబాద్, జులై 19: తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాభివృద్ధి పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాభివృద్ధి పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోందని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్‌కు లేఖ రాసిన ఆయన.. కరెంట్ బిల్లులు, డీజిల్ ఖర్చులు, శానిటేషన్ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ల ఈఎంఐలు, కాంట్రాక్టర్ల పాత బకాయిల చెల్లింపులకు ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇది 73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243G అధికరణం, 11వ షెడ్యూల్‌తో పాటు 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు కేంద్రం విడతల వారీగా రూ.2,293.74 కోట్ల నిధులను రాష్ట్రానికి విడుదల చేయగా, మరో రూ.729.41 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉందని బండి సంజయ్ తెలిపారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నయాపైసా కూడా ఇవ్వడం లేదని, ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై మౌఖిక ఆదేశాలతో ఒత్తిడి తీసుకొస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణ విచారణ జరిపి ఆడిట్ నిర్వహించాలని, దారి మళ్లించిన నిధులను తిరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధి ఖాతాలకు జమ చేయించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తెలంగాణకు రావాల్సిన మిగిలిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల