Share News

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వేదికపై కంటతడి పెట్టిన బండి సంజయ్

ABN , Publish Date - May 10 , 2026 | 06:29 PM

జై శ్రీరామ్‌ నినాదంతోనే గడీలను బద్దలుకొట్టామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జై శ్రీరామ్‌ నినాదంతోనే పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చామని, అదే నినాదంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు..  వేదికపై కంటతడి పెట్టిన బండి సంజయ్
Bandi Sanjay

హైదరాబాద్, మే 10: జై శ్రీరామ్‌ నినాదంతోనే గడీలను బద్దలుకొట్టామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జై శ్రీరామ్‌ నినాదంతోనే పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చామని, అదే నినాదంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ.. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ కంటతడిపెట్టుకున్నారు. తాము సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నామని అన్నారు. తమ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.


బండి సంజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘జై శ్రీరామ్‌ అంటే కడుపు నిండుతుందా అని కొందరు అన్నారు. జై శ్రీరామ్‌ నినాదమే మాలో పోరాటపటిమ నింపింది. జై శ్రీరామ్‌ అంటే కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు. పార్టీకి తలవంపులు తెచ్చే పనులు నేను చేయను. రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. భయపడడానికి నేను ఫామ్‌హౌస్‌లోని ఎలుకను కాను. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి?’..


’రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. బీజేపీ నేతలు భేదాభిప్రాయాలు వీడాలి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పోరాడాలి. మోదీ లేనిదే తెలంగాణలో ప్రభుత్వం నడవదు. బెంగాల్‌లో బీజేపీకి గెలుపు అంత సులభంగా రాలేదు. 300 మంది బీజేపీ కార్యకర్తలు బలిదానం చేశారు. కేరళలోనూ బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. నిధులు ఇచ్చేది మనం.. అభివృద్ధి చేసేదీ మనమే’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

విజయ్ ప్రమాణ స్వీకారానికి కుటుంబం దూరం.. నెట్టింట జోరుగా చర్చ..

తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య.. రేపు అసెంబ్లీ తొలి సమావేశం

Updated Date - May 10 , 2026 | 06:33 PM