పెళ్లి పేరిట రూ.9.35 కోట్ల మోసం?.. స్పందించిన అషురెడ్డి..
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:54 AM
తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ నటి అషురెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం ఓ స్టోరీ పెట్టింది.
హైదరాబాద్, ఏప్రిల్ 26: తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ నటి అషురెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం ఓ స్టోరీ పెట్టింది. ఆ స్టోరీలో.. ‘నా అనుమతి లేకుండా న్యూస్ లేదా తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటా’ అని రాసుకొచ్చింది.

ఆరోపణలు ఇవి..
పెళ్లి పేరిట తన కుమారుడిని మోసం చేసి రూ.9.35 కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపిస్తూ ఆషురెడ్డితో పాటు ఆమె కుటుంబసభ్యులపై షేక్‌పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. యెనుముల సత్యనారాయణ కుమారుడు వైవీ ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
2018 సంవత్సరంలో అతడు ఇండియాకు వచ్చాడు. ఈ సమయంలో అషురెడ్డితో అతడికి పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి అషురెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవటంతో పాటు బంగారం, ఫ్లాట్‌లు, వాహనాలు కోనుగోలు చేయించుకుంది. వాటి మొత్తం విలువ రూ. 9.35 కోట్లు ఉంటుంది. ధర్మేంద్ర పెళ్లి గురించి అడగ్గా.. ముఖం చాటేసింది. ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో స్విస్ విమానానికి మంటలు.. ఆరుగురికి గాయాలు..
ఇంట్లోనే రుచికరమైన మటన్ పులావ్.. ఎలా తయారు చేయాలో తెలుసా?