Share News

ఆల్ప్రాజోలం నెట్‌వర్క్ గుట్టురట్టు.. రూ.6 కోట్ల ఆస్తుల జప్తు

ABN , Publish Date - Aug 21 , 2026 | 08:19 PM

కొంతకాలంగా ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ భారీ చర్యలు చేపట్టింది. బోధన్‌లో 15 మంది నిందితులను అరెస్ట్ చేసి 32.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకోగా.. డ్రగ్ దందాతో కూడబెట్టినట్లు ఆరోపణలున్న రూ.6 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు ప్రక్రియ ప్రారంభించింది.

ఆల్ప్రాజోలం నెట్‌వర్క్ గుట్టురట్టు.. రూ.6 కోట్ల ఆస్తుల జప్తు
Alprazolam Trafficking Telangana

బోధన్‌, ఆగస్టు 21: ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌ను గుర్తించిన అధికారులు.. బోధన్‌లో 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 32.5 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్న ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇందులో 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు, ఒక కెమికల్ ఫ్యాక్టరీ, 4 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.


ఈ ఆస్తుల ప్రభుత్వ విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉండగా.. మార్కెట్ విలువ దాదాపు రూ.6 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. డ్రగ్ అక్రమ రవాణా ద్వారా సంపాదించినట్లు గుర్తించిన ఈ ఆస్తులను NDPS చట్టంలోని 68(F) నిబంధనల కింద జప్తు చేసేందుకు ఈగల్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. ఆల్ప్రాజోలం సరఫరా, రవాణా, విక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మూడు రాష్ట్రాలకు విస్తరించిన ఈ డ్రగ్ నెట్‌వర్క్‌లో మరెంతమంది ప్రమేయం ఉందనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..

Updated Date - Aug 21 , 2026 | 09:34 PM