Share News

ఇందిరాగాంధీకి కూడా ఇంకా ఓటు హక్కు ఉంది: కేంద్ర మంత్రి బండి సంజయ్

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:19 PM

భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎప్పుడో మరణించినప్పటికీ, ఆమెకు ఇప్పటికీ ఓటు హక్కు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తే ఓట్ చోరీ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

ఇందిరాగాంధీకి కూడా ఇంకా ఓటు హక్కు ఉంది: కేంద్ర మంత్రి బండి సంజయ్
Union Minister Bandi Sanjay

నిర్మల్: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎప్పుడో మరణించినప్పటికీ, ఆమెకు ఇప్పటికీ ఓటు హక్కు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తే ఓట్ చోరీ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్నవారి పేర్లను తొలగించడం తప్పెలా అవుతుందని నిలదీశారు.


నిర్మల్‌లో కొనసాగుతున్న బీజేపీ మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓట్ చోరీ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ అంటేనే ఓటర్ల జాబితాలో అనర్హుల ఓట్లను తొలగించి, అర్హుల ఓట్లను కొనసాగించడమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ హయాంలోనూ సర్ జరిగిందని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాలనలోనూ దీనిని నిర్వహించారని వెల్లడించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే సర్ చేపట్టిన విషయాన్ని రాహుల్ మర్చిపోకూడదని ఎద్దేవా చేశారు.


ఈ సందర్భంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవారు భారత ప్రధానిని నిర్ణయించలేరని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ దేశానికి చెందని వ్యక్తులు, అక్రమంగా చొరబడిన వారి ఓట్లను తప్పకుండా తొలగిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఇలాగే మాట్లాడితే ఎన్ఆర్‌సీ (NRC) కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. అవసరమైతే అక్రమంగా దేశంలోకి వలస వచ్చి ఇక్కడే నివసిస్తున్న విదేశీయులను వెనక్కి పంపిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు, సోషల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి: ఎమ్మెల్యే కూనంనేని

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

Updated Date - Nov 03 , 2026 | 05:19 PM