Share News

సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

ABN , Publish Date - Jun 19 , 2026 | 01:16 PM

సింగరేణిపై బీజేపీ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సింగరేణి సంస్థపై మాట్లాడే నైతిక అర్హత గానీ, అక్కడ పర్యటించే హక్కు గానీ బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
Addanki Dayakar news

హైదరాబాద్, జూన్ 19: సింగరేణిపై బీజేపీ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సింగరేణి సంస్థపై మాట్లాడే నైతిక అర్హత గానీ, అక్కడ పర్యటించే హక్కు గానీ బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సింగరేణికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యల ద్వారా బీజేపీ ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.


సింగరేణి సంస్థను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని అద్దంకి దయాకర్ ఆరోపించారు. పైకి మాత్రం వేర్వేరుగా నటిస్తున్నప్పటికీ.. ఈ రెండు పార్టీలు రాజకీయ మిత్రులని విమర్శించారు. సింగరేణిని చుట్టుముట్టి ఇరు పార్టీలు చేస్తున్నవి కేవలం రాజకీయాలేనని మండిపడ్డారు. దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తున్న విధానంపై, సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కిషన్ రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బీజేపీకి, బొగ్గు నిల్వలపై మాట్లాడే అర్హత ఎక్కడిదని నిలదీశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడింది, నిరంతరం ఆదుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

'దమ్ముంటే బాక్సింగ్ రింగ్‌లోకి రా'.. భజ్జీకి శ్రీశాంత్ సవాల్!

ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

Updated Date - Jun 19 , 2026 | 01:19 PM