Share News

మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:46 PM

అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ఏఐ సంస్థ తాజాగా గ్రోక్ 4.5 పేరిట సరికొత్త ఏఐ మోడల్‌ను లాంచ్ చేసింది.

మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ
SpacexAI Launches Grok 4.5

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రంగంలో పోటీ అంతకంతకూ తీవ్రం అవుతోంది. ఏఐ మోడల్స్ సామర్థ్యాలను పెంచడంతో పాటు తక్కువ ధరకు అవి అందరికీ అందుబాటులో ఉండేలా డిజైన్ చేయడంపై కంపెనీలు దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ఏఐ సంస్థ తాజాగా గ్రోక్ 4.5 పేరిట సరికొత్త ఏఐ మోడల్‌ను లాంచ్ చేసింది. ఐపీఓ తరువాత సంస్థ ఆవిష్కరించిన తొలి ఏఐ మోడల్ ఇదే.

ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్స్‌తో పోలిన సామర్థ్యాలు గ్రోక్ 4.5కి ఉందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువేనని చెప్పారు. ఇది ఆంథ్రోపిక్‌కు చెందిన ఓపస్ 4.7తో సమానమని చెప్పారు. అధిక సామర్థ్యాలు, వేగవంతమైన పనితీరు, తక్కువ ధర కారణంగా గ్రోక్ 4.5 ఇతర మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు.


తాజా మోడల్ గురించి మస్క్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవ ప్రపంచంలో పనులను చక్కబెట్టే ఏఐ మోడల్స్‌ అభివృద్ధిపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఏఐ నుంచి వ్యాపార వర్గాలు ఆశిస్తున్న పలు మేధోపరమైన పనులను గ్రోక్ 4.5 చక్కబెట్టగలదని చెప్పారు. ఇతర ఏఐ మోడల్స్‌తో పోలిస్తే తక్కువ ధరకే గ్రోక్ 4.5ని అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.

ప్రస్తుతం ఓపస్ 4.7 ఆంత్రోపిక్‌కు చెందిన నెం.2 ఏఐ మోడల్‌గా ఉంది. సంస్థకు చెందిన ఫేబుల్ 5 టాప్ పొజిషన్‌లో ఉంది. మైథోస్ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా ఫేబుల్ 5ని రూపొందించారు. అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలున్న ఈ మోడల్‌ను అమెరికా కొంత కాలం పాటు ఇతరులకు ఇవ్వకుండా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

Updated Date - Jul 09 , 2026 | 05:55 PM