ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:26 PM
స్కైరూట్ సంస్థ దేశానికి చెందిన ముగ్గురు గొప్ప సైంటిస్టులకు ఘన నివాళి తెలపడానికి సిద్ధమైంది. 'విక్రమ్-I' రాకెట్‌లో సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. స్కైరూట్ సంస్థ ఈ నెలలో 'మిషన్ ఆగమన్' పేరిట 'విక్రమ్-I' రాకెట్‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా స్కైరూట్ సంస్థ దేశానికి చెందిన ముగ్గురు గొప్ప సైంటిస్టులకు ఘన నివాళి తెలపడానికి సిద్ధమైంది. 'విక్రమ్-I' రాకెట్‌లో సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది.
మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ 18 క్యారెట్ల బంగారంతో ఒక చిన్న రాకెట్ ఆకృతిని తయారు చేసి.. అందులో ఈ ముగ్గురు సైంటిస్టుల విగ్రహాలను చెక్కారు. ఈ విగ్రహాలు ఒక్కోటి బియ్యపు గింజ కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో సూపర్ పవర్‌గా నిలిపిన ఆ ముగ్గురు మహానుభావుల గౌరవార్థం స్కైరూట్ ఈ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ముగ్గురు సైంటిస్టుల సూక్ష్మ విగ్రహాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రముఖ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ తయారు చేసిన 'కాస్మిక్ బ్లూమ్' కళాఖండం కూడా అంతరిక్షంలోకి ప్రయాణించనుంది.
ఇవి కూడా చదవండి
ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
వర్చువల్‌గా హాజరయ్యేందుకు అల్లు అర్జున్‌కు కోర్టు అనుమతి.. విచారణ వాయిదా