Share News

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

ABN , Publish Date - Jul 06 , 2026 | 08:57 PM

మెదడుకు సంబంధించిన త్రీడీ చిత్రాలను అత్యంత వేగవంతంగా రూపొందించే కంప్యూటర్ చిప్‌ను చైనా శాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు.

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం
China brain imaging chip

ఇంటర్నెట్ డెస్క్: మెదడుకు సంబంధించిన త్రీడీ చిత్రాలను అత్యంత వేగవంతంగా రూపొందించే ప్రత్యేక కంప్యూటర్ చిప్‌ను చైనా శాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు. పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ చిప్‌ను తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మెదడు త్రీడీ చిత్రాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ఎన్విడియా చిప్‌ కంటే ఇది 478 రెట్లు వేగవంతమైనదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్, ఫేజ్ ఛేంజ్ మెర్మిస్టర్స్‌తో ఒకే మెమరీ అరే‌పై డేటా స్టోరేజ్, కంప్యూటేషన్ జరిగేలా ఈ చిప్‌ను డిజైన్ చేశారు. దీంతో, చిప్‌లో సమాచార మార్పిడి మరింత వేగవంతమై త్వరిత గతిన త్రీడీ చిత్రాలు నిర్మించడం సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యుత్ వినియోగం కూడా మరింతగా తగ్గుతుందని చెబుతున్నారు. మెదడు త్రీడీ చిత్రాలను రూపొందించేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఎన్విడియా ఏ100తో పోలిస్తే ఇది 50 నుంచి 478 రెట్లు వేగంగా పనిచేయగలదని చైనా పరిశోధకులు పేర్కొన్నారు.


చిప్‌తో ఉపయోగాలు..

వైద్య రంగంలో ఈ చిప్ ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్-మెషీన్ ఇంటర్‌ఫేస్‌ పరికరాలను డిజైన్ చేసేందుకు ఈ చిప్ రూపొందించిన త్రీడీ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు. సంక్లిష్ట సర్జరీల సమయంలో వైద్యులకు కూడా ఈ త్రీడీ చిత్రాలు అక్కరకు వస్తాయి. ఈ చిప్ త్రీడీ చిత్రాలను అత్యంత వేగంగా సిద్ధం చేయడంతో సర్జరీ సమయాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు వైద్యులకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఇది మీ కోసమే..

Updated Date - Jul 06 , 2026 | 09:05 PM