జియోతో జట్టు.. ఇకపై వాట్సాప్‌లోనూ డేటా ఈసిమ్ ప్లాన్స్
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:30 PM
తరచూ విదేశీ పర్యటనలు చేసే వారికి వాట్సాప్ తాజాగా మరో శుభవార్త చెప్పింది. యూజర్లు తమ వాట్సాప్ నుంచే నేరుగా ఈసీమ్‌లను కొనుగులు చేసేందుకు వీలుగా ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేచ్చే ఏర్పాట్లు ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: తరచూ విదేశీ పర్యటనలు చేసే వారికి వాట్సాప్ తాజాగా మరో శుభవార్త చెప్పింది. యూజర్లు తమ వాట్సాప్ నుంచే నేరుగా ఈసీమ్‌లను కొనుగులు చేసేందుకు వీలుగా ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేచ్చే ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని స్థానిక మొబైల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్న వాట్సాప్ భారత్‌లో జియోతో జట్టుకట్టింది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విదేశాల్లో ఉన్నప్పుడు యూజర్లు మొబైల్ ఇంటర్నెట్ కోసం స్థానిక సిమ్ కార్డు కొనుగోలు చేయాల్సిన అగత్యం తప్పుతుంది. కేవలం పబ్లిక్ వైఫైలపైనే ఆధారపడాల్సిన నిస్సహాయత నుంచి విముక్తి లభిస్తుంది. ఈసిమ్‌తో అత్యంత సులువుగా మొబైల్ ఇంటర్నేట్ డేటాను వాడుకోవచ్చు.
ఈసిమ్ ఫీచర్‌కు సంబంధించి వాట్సాప్ తాజాగా కీలక ప్రకటన చేసింది. రిలయన్స్ జియో, స్మార్ట్ అటాక్సియా, స్మార్ట్ కమ్యూనికేషన్స్, వెరిజాన్ తదితర టెలికం సంస్థలతో కలిసి పనిచేయబోతున్నట్టు తెలిపింది. ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో త్వరలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. అయితే, ప్రారంభ తేదీ సహా ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.
ఈసిమ్ ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ వాట్సాప్ నుంచే రకరకాల ట్రావెల్ డేటా ఈసిమ్‌లను పరిశీలించి నచ్చిన దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టెలికం సంస్థల స్టోర్లు, లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ నుంచి వీటిని పొందాల్సిన అవసరం ఉండదు.
ఒకసారి ఈసిమ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యాక యూజర్లు దీని ద్వారా మొబలై డేటాను ఎప్పటిలాగే వాడుకోవచ్చు. ఇందుకు ఫోన్‌లో అప్పటికే ఉన్న సాధారణ సిమ్‌ను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్‌ను యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ సెక్షన్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్‌కు సంబంధించిన డేటా పరిమితులు, ధరలు, వివిధ రకాల ప్లాన్స్ గురించి వాట్సాప్ పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
వాట్సాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. యూజర్లకు కేంద్రం హెచ్చరిక
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు..