వాట్సాప్‌లో సాంకేతిక సమస్య.. ఇబ్బందిపడుతున్న యూజర్లు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 10:03 AM
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు. చాట్‌లో ఫోటోలు పంపినప్పుడు అవి 'స్పిన్నింగ్ ఐకాన్'తో ఆగిపోయి, ‘రీట్రైయ్’ అని చూపిస్తోంది. ఈ సమస్య తగ్గినట్లే తగ్గి.. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మొదలైంది. భారతదేశంతో పాటు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, మెక్సికో, జర్మనీ దేశాల్లో ఈ సమస్య కొనసాగుతోంది.
అంతేకాదు.. చాలా మంది సాధారణ వినియోగదారుల ఖాతాలను వాట్సాప్ 24 గంటల పాటు 'అండర్ రివ్యూ'లో ఉంచింది. నిబంధనలను ఉల్లంఘించారనే మెసేజ్ పంపి.. యాప్ ఫీచర్లను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఖాతాల నిలిపివేతపై వాట్సాప్ మాతృసంస్థ మెటా స్పందిస్తూ.. ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగం కాకుండా చూసే క్రమంలో అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని తెలిపింది. సమస్యను వీలైనంత త్వరగా పరిస్కరిస్తామని వెల్లడించింది. వాట్సాప్ టెక్నికల్ గ్లిచ్‌పై సోషల్ మీడియా వేదికగా యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కిడ్నాప్ కేసు.. గుజరాత్‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పాకిస్థాన్ జెర్సీలో సచిన్ టెండూల్కర్.. ఆ ఆసక్తికర ఘటన గురించి తెలుసా?