ఆ ఏఐ మోడల్స్‌తో మానవాళి అంతం.. మరో ఓపెన్ ఏఐ పరిశోధకుడి హెచ్చరిక
ABN , Publish Date - Sep 15 , 2026 | 10:52 PM
ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన మరో పరిశోధకుడు డేనియల్ శెల్సామ్ కీలక హెచ్చరికలు చేశారు. ఏఐని మనిషి నియంత్రణ లేని స్థితి ఒకటి వస్తుందని హెచ్చరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అంతకంతకూ పెరుగుతున్న ఏఐ సామర్థ్యాలపై టెక్ నిపుణుల్లో ఆందోళన అధికమవుతోంది. తాజాగా ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన మరో పరిశోధకుడు డానియల్ శెల్సామ్ కీలక హెచ్చరికలు చేశారు. ఏఐని మనిషి నియంత్రణ లేని స్థితి రావొచ్చని హెచ్చరించాడు. చివరకు మానవాళి అంతమైపోవచ్చని పేర్కొన్నాడు. ఈ ముప్పును తప్పించుకునేందుకు కేవలం ఏఐ అభివృద్ధి నెమ్మదించేలా చేస్తే సరిపోదని కూడా అన్నాడు. ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశాడు.
తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకునే స్థితికి ఏఐ క్రమంగా చేరువవడం ఆందోళన కలిగించే అంశమని డానియల్ చెప్పుకొచ్చాడు. తమను పరిశోధకులు గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా పసిగట్టగలిగే స్థితికి అవి చేరుకోవచ్చని అన్నాడు.
భవిష్యత్తులో ఏఐ మెడల్స్ తమను పరీక్షిస్తున్న సమయంలో ఒకలా, మనుషుల పర్యవేక్షణ లేని సమయాల్లో మరోలా నడుచుకునే ముప్పు ఉందని డానియల్ చెప్పాడు. దీంతో, ఏఐ భద్రతా పరీక్షలు నిరర్ధకంగా మారతాయని అన్నాడు. చివరకు ఒక ఏఐ మోడల్ భద్రమో కాదో పరిశోధకులు చెప్పలేని స్థితి రావొచ్చని ఆందోళన వ్యక్తతం చేశారు. ఈ పరిస్థితి రాకూడదంటే ఏఐకి ఆ సామర్థ్యాలు అందకూడదని అన్నారు. ఆ స్థాయి ఏఐ మోడల్స్ అభివృద్ధి జరగకూడదని చెప్పారు. మరోవైపు, చైనా ఏఐ పరిశోధకులు కూడా ఈ రంగంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సామర్థ్యాలు ఒక్క కంపెనీ చేతుల్లోకి వెళ్లడమంటే హిట్లర్‌కు అణుబాంబు దొరికినట్టేనని చైనా పరిశోధకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇలాగైతే బార్బర్ జాబ్స్ కూడా పోతాయి: హర్ష్ గొయెంకా
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్