49 ఏళ్లుగా అంతరిక్ష యాత్ర! భూమికి ఒక కాంతి-దినం దూరంలో..
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:12 PM
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన వాయోజర్-1 వ్యోమ నౌక మరో సరికొత్త రికార్డును సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమ నౌక మరో మైలురాయిని చేరుకుంది. భూమి నుంచి ఒక ‘కాంతి-దినం’ దూరానికి చేరుకున్న తొలి మానవనిర్మిత వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది. భారత కాలమానం ప్రకారం, నవంబర్ 18న మధ్యాహ్నాం 3.46 గంటలకు ఈ దూరానికి ( 25.9 బిలియన్ కిలోమీటర్లు) చేరుకుంది. దాదాపు 49 ఏళ్లుగా అంతరిక్షంలో వాయేజర్-1 తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఒక రోజులో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి-దినం అంటారన్న విషయం తెలిసిందే.
కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక వాయోజర్-1 ప్రస్తుతం గంటకు 61 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. ఓ కాంతి-దినంతో సమానమైన దూరాన్ని ఈ వేగంతో చేరుకునేందుకు వాయోజర్-1కు దాదాపు అర్ధశతాబ్ద కాలం పట్టింది. ప్రస్తుతం భూమి నుంచి శాస్త్రవేత్తలు పంపించే రేడియో సిగ్నల్ వాయోజర్-1ను చేరుకునేందుకు 24 గంటల సమయం పడుతుంది. ఆ తరువాత వాయోజర్ పంపించే సిగ్నల్ భూమికి చేరేందుకు మరో 24 గంటలు పడుతుంది.
1977 సెప్టెంబర్ 5న నాసా వాయోజర్-1ను ప్రయోగించింది. సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహాల అధ్యయనం కోసం దీన్ని ప్రయోగించింది. 1979లో బుధగ్రహాన్ని దాటిన వాయోజర్-1 ఆ తరువాత ఏడాదికి శని గ్రహాన్ని దాటింది. 2012లో ఆగస్టులో తొలిసారిగా సూర్యుడి ప్రభావాన్ని దాటుకుని సౌరకుటుంబానికి ఆవల మరో ప్రపంచంలో ప్రవేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక గూగుల్ డ్రైవ్ లేకుండానే డైరెక్ట్ బ్యాకప్
పౌరులు, పాఠశాలలపై టార్గెట్.. ఏఐ మోడళ్ల తీరుపై ఆందోళన