బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్.. ఈ నెలలోనే లాంచ్?
ABN , Publish Date - Feb 06 , 2026 | 05:59 PM
బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ 17ఈని యాపిల్ ఈ నెలలోనే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 17ఈ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఐఫోన్స్‌లో అత్యంత తక్కువ ధరకు లభించే ఎస్‌ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16ఈ తరువాత 17ఈని ప్రవేశపెట్టేందుకు యాపిల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 16ఈతో పోలిస్తే మరిన్ని మెరుగైన ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది (Iphone 17e Launch).
ప్రాసెసర్: ఐఫోన్ 17ఈలో ఈసారి శక్తిమంతమైన ఏ19 చిప్‌ను జోడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏ18 ప్రో చిప్‌సెట్‌తో దీన్ని లాంచ్ చేయొచ్చని కూడా కొందరు చెబుతున్నారు.
వైర్‌లెస్ చార్జింగ్: మునుపటి కంటే పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో పాటు క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్, 25వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉండనుంది. ఫోన్ వెనుకవైపు 48 ఎంపీ కెమెరాతో పాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 ఎంపీ కెమెరాను ఐఫోన్ 17ఈలో ఏర్పాటు చేయనున్నారు. కొన్ని వర్గాల ప్రకారం, ఈ ఫోన్‌లో టచ్ రికగ్నిషన్‌కు బదులుగా ఫేస్ ఐడీ రికగ్నిషన్ ఫీచర్‌ను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.
విశ్లేషకుల ప్రకారం, ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసే ఛాన్స్ ఉంది. దీని ధర సుమారు 599 డాలర్ల నుంచి 649 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. ఐఫోన్స్‌లో ఎంట్రీ లెవెల్ మోడల్‌ను కోరుకునే వారికి ఈ ఫోన్‌ను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ పేరులోని ‘ఈ’ అంటే ఎంట్రీ లేదా ఎసెన్షియల్ (అవసరమైన..) అనే అర్థమని కూడా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే, ఈ విషయమై యాపిల్ ఇప్పటివరకూ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కాబట్టి ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
ఇవీ చదవండి
మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగు: ఎస్ఏపీ సంస్థ సీఈఓ
ప్రియుడి బండారం బయటపెట్టిన చాట్‌జీపీటీ.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..