ఇన్‌స్టా నుంచి కొత్త యాప్.. స్నాప్‌చాట్‌కు పోటీగా..
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:49 PM
క్విక్ ఫొటో షేరింగ్ కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాంట్స్ పేరిట ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఉన్న డెడికేటెడ్ యాప్‌తో పాటు ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంచింది.
ఇంటర్నెట్ డెస్క్: ట్రెండ్‌కు తగ్గట్టు కొత్త ఫీచర్స్‌ను యూజర్లకు అందించే ఇన్‌స్టాగ్రామ్ తాజాగా ఇన్‌స్టాంట్స్ అనే కొత్త ఫొటో షేరింగ్ ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్‌ను ప్రధాన యాప్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు ఒక డెడికేటెడ్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టాంట్స్ ఫీచర్ ద్వారా షేర్ చేసిన ఫొటోలను కేవలం ఒక్కసారి మాత్రమే చూసే వీలుంటుంది. అంతేకాకుండా, ఫొటోను చూసేందుకు యూజర్లకు 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఫొటో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్‌ను ఇన్‌స్టా డిజైన్ చేసింది.
స్పాప్‌చాట్‌లో ఈ డిసప్పియరింగ్ ఫొటో ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్‌స్టాంట్స్ లాగా కచ్చితమైన టైమ్ లిమిట్ ఏదీ లేదు. యూజర్ ఓపెన్ చేసేంత వరకూ ఫొటో అందుబాటులో ఉంటుంది. ఇక ఇన్‌స్టాంట్స్‌లో ఇన్-యాప్ కెమెరాతో తీసిన ఫొటోలను మాత్రమే షేర్ చేసే ఛాన్స్ ఉంది. కెమెరా రోల్‌లోని ఫొటోలను అప్‌లోడ్ చేసే ఆప్షన్ లేదు. ఈ యాప్‌తో తీసుకున్న ఫొటోపై టెక్స్ట్ యాడ్ చేయడం మినహా ఇతర ఎడిట్స్‌కు కూడా అవకాశం లేదు. ఫొటోలను యథాతథంగా ఎలాంటి ఫిల్టర్‌ల బెడద లేకుండా షేర్ చేసేందుకు ఇన్‌స్టా ఈ ఫీచర్‌ను డిజైన్ చేసింది.
ప్రస్తుతం స్పెయిన్, ఇటలీ దేశాల్లోని యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. యాండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లు ఉన్న వారు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐ భవితవ్యం.. అప్పటివరకూ జనాల జాబ్స్ సేఫ్!
శ్రీధర్ వెంబు టిప్స్.. ఏఐ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..