Share News

ఇండక్షన్ స్టవ్ వర్సెస్ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్.. ఇండియన్ కిచెన్‌కు ఏది బెస్ట్?

ABN , Publish Date - Mar 18 , 2026 | 03:09 PM

దేశంలో గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో జనం గ్యాస్ ప్రత్యామ్నాయం వైపు పరుగులు తీస్తున్నారు. ఇండక్షన్, ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇండక్షన్ వర్సెస్ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లలో వంట వండుకోవటానికి అన్ని రకాలుగా ఏది బెస్ట్ ?..

ఇండక్షన్ స్టవ్ వర్సెస్ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్.. ఇండియన్ కిచెన్‌కు ఏది బెస్ట్?
induction vs infrared cooking

ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా భారత్‌లో గ్యాస్ కొరత తీవ్రతరం అయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇక, డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో కూడా సమస్యలు తప్పటం లేదు. కొంతమందికి గ్యాస్ బుక్ అవ్వటం లేదు. మరి కొంత మందికి గ్యాస్ బుక్ అయినా కూడా డెలివరీకి 20 రోజుల పైనే సమయం పడుతోంది. ఇలాంటి సమయంలో జనం గ్యాస్ ప్రత్యామ్నాయం వైపు పరుగులు తీస్తున్నారు. ఇండక్షన్, ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇండక్షన్ వర్సెస్ ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌లలో వంట వండుకోవటానికి అన్ని రకాలుగా ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఏ స్టవ్ ఎలా పని చేస్తుంది?

ఇన్‌ఫ్రారెడ్ : ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌ మీద పాత్రలు ఉంచడానికి ఓ ప్రత్యేక గ్లాస్ ఉపరితలం ఉంటుంది. గ్లాస్ ఉపరితలం కింద ఉండే హీటింగ్ ఎలిమెంట్స్ దాన్ని వేడి చేస్తాయి. వేడైన గ్లాస్ ఉపరితలం మీద పాత్రలు పెడితే అవి కూడా వేడెక్కుతాయి. ఈ పద్ధతి ద్వారా వంటలు చేసుకోవటానికి వీలుంటుంది. ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌ల మీద ఏ పాత్ర పెట్టినా అది వేడవుతుంది.


ఇండక్షన్ స్టవ్ : ఇండక్షన్ స్టవ్‌ల మీద పాత్రలు ఉంచడానికి ఓ ప్రత్యేక ఉపరితలం ఉంటుంది. ఆ ఉపరితలం కింద కాపర్ కాయిల్ ఉంటుంది. ఆ కాపర్ కాయిల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్‌ను తయారు చేసి.. నేరుగా పాత్రల అడుగు భాగాన్ని వేడెక్కేలా చేస్తుంది. అయితే, స్టేయిన్ లెస్ స్టీల్ లేదా ఐరన్ పాత్రలు మాత్రమే ఇండక్షన్ స్టవ్ మీద పని చేస్తాయి. అది కూడా మ్యాగ్నెటిక్ బేస్ ఉన్న పాత్రల్లో మాత్రమే వంటలు వండుకోవటానికి ఉంటుంది.


ఇండియన్ కిచెన్‌కు ఏది బెస్ట్?

ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌ల కంటే వేగంగా ఇండక్షన్ స్టవ్‌లు వేడిని పుట్టిస్తాయి. ఇండక్షన్ స్టవ్‌లలో టెంపరేచర్‌ను చాలా వేగంగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, ఇన్‌‌ఫ్రారెడ్ స్టవ్‌లో సెట్టింగ్స్ మార్చిన చాలా సేపటి తర్వాత టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఇండక్షన్ స్టవ్‌లలో ఎనర్జీ వేస్ట్ చాలా తక్కువ. ఇండక్షన్‌లు 90 శాతం ఎనర్జీని పాత్రలు వేడిచేయడానికి ఉపయోగిస్తాయి. కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. ఇన్‌‌ఫ్రారెడ్ స్టవ్‌లో ఎనర్జీ వేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇండక్షన్‌తో పోల్చుకుంటే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. ఇక సేప్టీ విషయానికి వస్తే ఇండక్షన్‌లు చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చేతులు కాలే ప్రమాదం ఉండదు. ధరల విషయానికి వస్తే.. ఇండక్షన్ స్టవ్‌ల ధర 1200 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇన్‌ఫ్రారెడ్ స్టవ్‌ల ధర 2500 రూపాయలు పైనే ఉంటుంది.


ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్

ఒంటరిగా ఫీలవుతున్నారా? కారణం మీ అలవాట్లే కావచ్చు!

Updated Date - Mar 18 , 2026 | 03:43 PM