గూగుల్ సర్వర్‌లో సమస్య.. ప్రపంచ వ్యాప్తంగా సేవలకు అంతరాయం..
ABN , Publish Date - May 12 , 2026 | 10:49 AM
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి. గూగుల్‌లో సెర్చ్ చేయగా.. సర్వర్ ఎర్రర్ పాప్ అప్ వచ్చింది. దీంతో వినియోగదారులు ఇబ్బందికి గురయ్యారు. ఒక్క ఇండియాలోనే ఈ సమస్యపై నిమిషంలో 200కు పైగా కంప్లైంట్‌లు వచ్చాయని ఓ ప్రముఖ జాతీయ మీడియా పేర్కొంది.

జాతీయ మీడియా కథనం ప్రకారం.. 57 శాతం మంది సెర్చ్ సమయంలో ఎర్రర్ చూపిస్తోందని ఫిర్యాదు చేశారు. 28 శాతం మంది కంటెంట్ చాలా స్లోగా లోడ్ అవుతోందని ఫిర్యాదు చేశారు. 11 శాతం మంది మొత్తం వెబ్ సైట్‌లోనే సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. ఉదయం 10.30 గంటల సమయానికి కంప్లైంట్‌లు 3వేలకు చేరాయి. అయితే, గూగుల్ ఈ సమస్యను చాలా వేగంగా పరిష్కరించింది. 10.34 గంటల సమయానికి సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ కారణంగానే సమస్య తలెత్తినట్లు గూగుల్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్
ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లు ఇవే..