Share News

12 వేల ఏళ్ల తర్వాత మళ్లీ గుంపుగా వేటాడుతున్న డైర్ వోల్ఫ్‌లు

ABN , Publish Date - Feb 22 , 2026 | 09:27 PM

కోలోసల్ బయోసైన్సెస్ మరోసారి వార్తలో నిలిచింది. ఈ సారి కూడా డైర్ వోల్ఫ్‌లకు చెందిన న్యూస్‌‌తోటే జనం ముందుకు వచ్చింది. తమ కంపెనీ తిరిగి తీసుకొచ్చిన డైర్ వోల్ప్‌లు మూడు గుంపుగా వేటాడుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

12 వేల ఏళ్ల తర్వాత మళ్లీ గుంపుగా వేటాడుతున్న డైర్ వోల్ఫ్‌లు
dire wolves brought back

అమెరికాకు చెందిన కోలోసల్ బయోసైన్సెస్ మరోసారి వార్తలో నిలిచింది. ఈ సారి కూడా డైర్ వోల్ఫ్‌లకు చెందిన న్యూస్‌‌తో జనం ముందుకు వచ్చింది. తాము డీఎన్, క్లోనింగ్, జన్యు ఇంజినీరింగ్ ద్వారా తిరిగి సృష్టించిన డైర్ వోల్ప్‌లు.. మూడు గుంపుగా వేటాడుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డైర్ వోల్ఫ్‌లు కలిసి వేటాడుతున్న దృశ్యాల తాలూకా ఫొటోలను కూడా విడుదల చేసింది. ఆ ఫొటోలలో డైర్ ‌వోల్ఫ్‌లు మాంసాన్ని తింటున్న దృశ్యాలతో పాటు నిద్రపోతున్న దృశ్యం కూడా ఉంది. కంపెనీ అధికార ప్రతినిధి జేమ్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ రోములుస్, రెముస్, ఖలీసీలు ఎంతో చక్కగా వేటాడుతున్నాయి.


చిన్న చిన్న కుందేళ్లను వేటాడటంలో ఆరితేరాయి. ఇప్పుడు పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడ్డం నేర్చుకుంటున్నాయి’ అని తెలిపారు. కాగా, డైర్ వోల్ఫ్‌లు ఎప్పుడో 12 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. టెక్సాస్‌కు చెందిన కోలోసల్ బయోసైన్సెస్ ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిసృష్టి చేసింది. ‘డైర్ వోల్ఫ్ డీ ఎక్స్‌టిన్షన్ ప్రాజెక్ట్’తో అద్భుతానికి తెరతీసింది. అంతరించిపోయిన డైర్ వోల్ఫ్‌లను మళ్లీ తిరిగి తీసుకొచ్చింది. అంతరించిపోయిన డైర్ వోల్ఫ్ డీఎన్ఏను ప్రస్తుతం ఉన్న తోడేళ్ల డీఎన్ఏతో కలిపి కోలోసల్ బయోసైన్సెస్ శాస్త్రవేత్తలు వీటిని సృష్టించారు.


కోలోసల్ బయోసైన్సెస్ చెబుతున్న దాని ప్రకారం.. డైర్ వోల్ఫ్‌లకు ఉన్నట్లుగానే వీటికి కూడా తెల్లటి వెంట్రుకలు ఉన్నాయి. వాటి శరీరం, తలలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ డైర్ వోల్ఫ్‌లు ఇప్పుడున్న తోడేళ్ల కంటే 20 రెట్లు బరువైనవి. కోలోసల్ కంపెనీ గత సంవత్సరం ఏప్రిల్ నెలలో డైర్ వోల్ఫ్‌లకు చెందిన వీడియోలను మొదటి సారి విడుదల చేసింది. రోములుస్, రెముస్, ఖలీసీలను మొదటి సారి ప్రపంచానికి పరిచయం చేసింది.


ఇవి కూడా చదవండి..

రజకుల అభివృద్ధికి రూ. 100 కోట్లు.. నూజివీడు మహాసభలో మంత్రి కొలుసు పార్థసారధి హామీ

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

Updated Date - Feb 22 , 2026 | 09:44 PM