Share News

అమెరికాకు చైనా సవాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఏఐ మోడల్ ఆవిష్కరణ

ABN , Publish Date - Jul 19 , 2026 | 10:53 AM

ఏఐ రంగంలో చైనా అమెరికాకు మరో సవాలు విసిరింది. చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ మూన్‌షాట్ ఏఐ మరో భారీ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది.

అమెరికాకు చైనా సవాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఏఐ మోడల్ ఆవిష్కరణ
Moonshot AI Model Kimi K3 Launched

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రంగంలో చైనా అమెరికాకు మరో సవాలు విసిరింది. చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ మూన్‌షాట్ ఏఐ మరో భారీ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. 2.8 ట్రిలియన్ పారామీటర్లతో కీమీ కే3 పేరిట ఈ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఏఐ మోడల్ అని కూడా పేర్కొంది. యూఎస్ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన అత్యాధునిక ఫేబుల్ ఏఐ మోడల్‌తో తమ ఉత్పత్తి పోటీ పడగలదని కూడా పేర్కొంది.

3 ట్రిలియన్ పారామీటర్లకు చేరువైన తొలి ఓపెన్ ఏఐ మోడల్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌డ్ రీజనింగ్, లాంగ్ హొరైజన్ కోడింగ్, ఇతర మేధో ఆధారిత పనుల కోసం మూన్‌షాట్ ఏఐ దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. దీన్ని ఒక మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్ విండోతో రూపొందించారు. అంటే.. గతంలో కంటే ఎక్కువ సమాచారంతో పెద్ద ప్రశ్నలను యూజర్లు సంధించే అవకాశం ఉంటుంది. తమ మోడల్.. ఆంథ్రోపిక్‌కు చెందిన ఫేబుల్ 5కు గట్టి పోటీ ఇచ్చిందని, జీపీయూ కెర్నెల్ ఆప్టిమైజేషన్ ప్రాతిపదికన ఓపెన్ ఏఐకి చెందిన అత్యాధునిక మోడల్స్‌ను అధిగమించిందని మూన్‌షాట్ ఏఐ పేర్కొంది. థర్డ్ పార్టీ సమీక్షల్లో కూడా తమ మోడల్‌కు మంచి మార్కులు పడ్డాయని సంస్థ తెలిపింది.


ప్రపంచంలో ఏఐ రేసు హీటెక్కుతున్న తరుణంలో చైనా సంస్థలు అమెరికా సంస్థలను అధిగమించేందుకు భారీ కసరత్తు చేస్తున్నాయి. మూన్‌షాట్ ఏఐతో పాటు జీ.ఏఐ, మిపీమ్యాక్స్ వంటి సంస్థలు భారీ ఏఐ మోడల్స్‌ను మరింత తక్కువ ఖర్చుతో డిజైన్ చేస్తున్నాయి. ఆంథ్రోపిక్‌ సంస్థకు చెందిన అత్యాధునిక మోడల్‌ ఇతర దేశాలకు ఇవ్వకుండా ఇటీవల నిషేధం విధించిన యూఎస్ ప్రభుత్వం ఆ తరువాత వెనక్కు తగ్గింది. చైనా సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలోనే అమెరికా వెనక్కు తగ్గిందన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

మీ వాట్సాప్ అకౌంట్ భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి

ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

Updated Date - Jul 19 , 2026 | 11:34 AM