ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో కొత్త ఫీచర్!
ABN , Publish Date - Jul 16 , 2026 | 09:05 PM
ఐఫోన్ యూజర్లు ఫోన్ కాల్ సమయంలో వివిధ రకాల మైక్రోఫోన్ ప్రాసెసింగ్ మోడ్స్‌ను మరింత సులభంగా ఎంచుకునేందుకు వాట్సాప్ ఒక షార్ట్‌కట్‌ను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ యూజర్లు ఫోన్ కాల్ సమయంలో వివిధ రకాల మైక్రోఫోన్ ప్రాసెసింగ్ మోడ్స్‌ను మరింత సులభంగా ఎంచుకునేందుకు వాట్సాప్ ఒక షార్ట్‌కట్‌ను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షార్ట్‌కట్ బీటా వర్షన్ కొందరికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. ఇప్పటివరకూ కాల్ సమయంలో స్టాండర్డ్, వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్, ఆటోమేటిక్ మోడ్ వంటి మైక్రోఫోన్ సెట్టింగ్స్‌ను మార్చేందుకు యూజర్లు ఐఫోన్ కంట్రోల్ సెంటర్‌ను ఓపెన్ చేయాల్సి వచ్చేంది. ఇందుకు బదులుగా వాట్సాప్ కాల్ ఇంటర్‌ఫేస్ నుంచే నేరుగా దీన్ని యాక్సెస్ చేసేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ లాంఛ్ చేసినట్టు తెలుస్తోంది. ఐఫోన్ కోసం ప్రత్యేకంగా ఆడియో ప్రాసెసింగ్ టెక్నాలజీని లాంఛ్ చేసే బదులు ఐఓఎస్‌లోని సాంకేతికతనే వినియోగించుకునేందుకు వాట్సాప్ నిర్ణయించినట్టు సమాచారం.
ఫేస్‌టైమ్‌తో పాటు ఇతర థర్డ్ పార్టీ యాప్స్‌ను వినియోగించే వారి కోసం ఐఫోన్ ఐఓఎస్ 15లో భాగంగా వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్ ఆడియో ప్రాసెసింగ్ మోడ్స్‌ను లాంఛ్ చేసింది. ఆ తరువాత ఐఓఎస్ 18లో భాగంగా ఆటోమేటిక్ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. చివరిగా వాయిస్ ఐసోలేషన్‌ను సాధారణ ఫోన్ కాల్స్‌కు వర్తింపజేసింది. ఫోన్ మాట్లాడే సమయంలో చుట్టుపక్కల శబ్దాల బెడద లేకుండా కేవలం మాటలు మాత్రమే అవతలి వారికి చేరేందుకు వాయిస్ ఐసోలేషన్ మోడ్ వాడతారన్న విషయం తెలిసిందే. ఇతర సందర్భాల్లో కోసం మిగతా ఆడియో ప్రాసెసింగ్ మోడ్స్‌ను ఐఫోన్ లాంఛ్ చేసింది. ఇదిలా ఉంటే, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రం వాట్సాప్ ప్రత్యేకంగా నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..
మరో ఏఐ మోడల్‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ