బడ్జెట్ ఐఫోన్‌ను రిలీజ్ చేసిన యాపిల్
ABN , Publish Date - Mar 02 , 2026 | 08:50 PM
బడ్జెట్ ఐఫోన్ 17ఈ మోడల్ భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ఫోన్ ప్రారంభ ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత చవకైన ఐఫోన్ 17ఈని యాపిల్ తాజాగా భారత్‌లో ఆవిష్కరించింది. మార్చ్ 4వ తేదీ సాయంత్రం నుంచి ప్రీఆర్డర్స్‌ను తీసుకుంటామని వెల్లడించింది. మార్చ్ 11 నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.
ఐఫోన్ 17ఈలోని టాప్ 5 ఫీచర్స్ ఇవే
ఏ19 చిప్‌సెట్, అత్యాధునిక సీ1ఎక్స్ మోడెమ్, మాగ్‌సేఫ్ చార్జింగ్ సపోర్టు, మన్నికైన గ్లాస్‌తో లభించే ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 16ఈ లుక్స్‌తో ఉన్న ఐఫోన్ 17ఈకి ముందువైపు సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్‌ను యాపిల్ జోడించింది. బ్లాక్, వైట్, సాఫ్ట్ పింక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 1.5కే రిజల్యూషన్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్‌ఈడీ స్క్రీన్, 800 నిట్స్ వరకూ బ్రైట్‌నెస్, 60 హెర్ట్‌జ్ రిఫ్రెష్ రేటు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ర్యామ్, 5 స్టోరేజీని బట్టి పలు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ వెనుక వైపు 2X టెలీఫోటో 48 ఎంపీ కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రారంభ మోడల్ 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది. ర్యామ్, స్టోరేజీ కెపాసిటీని బట్టి రూ.64,900 ప్రారంభ ధర మొదలు వివిధ ఐఫోన్ 17ఈ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ వార్తలూ చదవండి:
మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక
మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్