Share News

ఏఐతో జాబ్ పోతే ఒత్తిడి.. వీడియో గేమ్స్‌తో ఊరట: ఆంథ్రోపిక్ సీఈఓ వ్యాఖ్య

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:17 PM

ఏజీఐతో మనుషులకు ఉద్యోగాలే లేని కాలంలో ఎలా నెట్టుకురావాలో చెబుతూ ఆంథ్రోపిక్ సీఈఓ గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏఐతో జాబ్ పోతే ఒత్తిడి.. వీడియో గేమ్స్‌తో ఊరట: ఆంథ్రోపిక్ సీఈఓ వ్యాఖ్య
Dario Amodei

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఏఐ నిపుణులు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్‌ను (ఏజీఐ) రూపొందించడంలో బిజీగా ఉన్నారు. మనుషులు చేసే అన్ని పనులను మరింత మెరుగ్గా చేయడం ఏజీఐ ప్రత్యేకత. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ప్రపంచం సుసంపన్నం అవుతుందని, లేమి అనేదే ఉండదన్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, పనే లేని కాలంలో మనిషి పరిస్థితి ఏమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితి గురించి కొన్నేళ్ల క్రితమే ఆలోచించిన ఆంథ్రోపిక్ సీఈఓ అప్పట్లో ఓ కీలక వ్యాఖ్య చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఓపెన్ఏఐలో పని చేస్తున్న రోజుల్లోనే డారియోకు ఈ ఆలోచన వచ్చినట్టు సమాచారం. ఉద్యోగాలే లేక రాజకీయ కలకలం రేగుతున్న తరుణంలో ప్రజలు ఇమ్మర్సివ్ వీడియోగేమ్స్ ఆడుతూ కొంత మనసు మళ్లించుకోవచ్చని ఆయన సూచించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ ప్రతిపాదనను ఆయన ఓ పరిష్కారంగా పేర్కొన్నారా? అనే విషయంపై క్లారిటీ లేదు. అసలు ఈ విధానం ఎలా ప్రయోజనం కలిగిస్తుందన్న విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రస్తతం ఈ ఉదంతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ఉద్యోగం అనేది అనేక మందికి ఆదాయంతో పాటు లక్ష్యం, గుర్తింపు, సంతృప్తిని కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

167 ఏళ్ల గణిత రహస్యాన్ని ఛేదించిన క్లౌడ్ ఏఐ.. ఆంథ్రోపిక్ శాస్త్రవేత్త సంచలన ప్రకటన..

ఎన్విడియాకు రాన్సమ్‌వేర్ వార్నింగ్! 10 రోజుల డెడ్‌లైన్

Updated Date - Nov 22 , 2026 | 06:17 PM