Share News

కోడి ముందా.. గుడ్డు ముందా.. అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం చెప్పిన ఏఐ..

ABN , Publish Date - May 03 , 2026 | 08:19 AM

కోడి ముందా.. గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేసింది. నూటికి నూరు శాతం గుడ్డే ముందు అని చెబుతోంది. కోడి పుట్టుక గురించి అద్భుతంగా వివరిస్తోంది.

కోడి ముందా.. గుడ్డు ముందా.. అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం చెప్పిన ఏఐ..
chicken or egg answer

ఇంటర్‌నెట్ డెస్క్: కోడి ముందా.. గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేసింది. నూటికి నూరు శాతం గుడ్డే ముందు అని చెబుతోంది. కోడి పుట్టుక గురించి అద్భుతంగా వివరిస్తోంది. కోడి ముందా.. గుడ్డు ముందా అని చాట్‌జీపీటీని అడిగినపుడు అది ఈ విధంగా సమాధానం ఇచ్చింది. చాట్‌జీపీటీ చెబుతున్న దాని ప్రకారం..


కోళ్ల కంటే మిలియన్ సంవత్సరాల ముందు నుంచి గుడ్లు ఉన్నాయి. డైనోసార్ల కంటే ముందున్న జీవులు కూడా గుడ్ల ద్వారా పిల్లలకు జన్మనిచ్చేవి. కాలక్రమేణా గుడ్లు పెట్టే ఆ జీవులు పక్షులుగా మారాయి. కోళ్లను గాలస్ గాలస్ డొమెస్టికస్(Gallus gallus domesticus) అంటారు. జన్యు మార్పుల కారణంగా ఈ జాతి పుట్టుకువచ్చింది. కోడిలా ఉండే (పూర్తిస్థాయి కోడి కాదు) ఓ పక్షి ప్రత్యుత్పత్తి సమయంలో జరిగిన ఒక చిన్న జన్యు మార్పు (genetic mutation) కారణంగా.. ఆ గుడ్డులోని పిండం మొట్టమొదటి నిజమైన కోడిగా అభివృద్ధి చెందింది.


అంటే దీనర్థం కోళ్ల పుట్టుకకు ముందు నుంచే గుడ్లు ఉన్నాయి. కోళ్లకు జన్మనిచ్చిన పక్షులు కూడా గుడ్లను పొదిగి పిల్లలకు జన్మనిచ్చేవి. ఇదంతా ఒకే సారి జరగలేదు. గుడ్లు పెట్టే అనేక తరాల పూర్వీకుల నుంచి.. పరిణామ క్రమంలో చివరికి కోడి ఉద్భవించింది. ఎన్నో మార్పుల తర్వాత కోడి పుట్టుకువచ్చింది.


ఇవి కూడా చదవండి

లెబనాన్‌లో హెజ్‌బొల్లాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 50 కీలక స్థావరాలు ధ్వంసం

డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..

Updated Date - May 03 , 2026 | 09:23 AM