Share News

నేటినుంచి యూత్‌ ఒలింపిక్స్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:48 AM

యువ క్రీడాకారుల సత్తా ప్రదర్శించే వేదిక.. యూత్‌ ఒలింపిక్స్‌కు వేళైంది. సెనెగల్‌ రాజధాని డకార్‌లో శనివారం ఆరంభమయ్యే ఈ పోటీలు నవంబరు 13 వరకు జరగనున్నాయి.

నేటినుంచి యూత్‌ ఒలింపిక్స్‌
Youth Olympics 2026

  • భారత్‌ నుంచి బరిలో 17 మంది

న్యూఢిల్లీ: యువ క్రీడాకారుల సత్తా ప్రదర్శించే వేదిక.. యూత్‌ ఒలింపిక్స్‌కు వేళైంది. సెనెగల్‌ రాజధాని డకార్‌లో శనివారం ఆరంభమయ్యే ఈ పోటీలు నవంబరు 13 వరకు జరగనున్నాయి. 15-18 ఏళ్ల మధ్య వయస్సున్న అథ్లెట్లు పాల్గొనే యూత్‌ ఒలింపిక్స్‌లో.. 207 దేశాల నుంచి 2700 మంది బరిలో దిగుతున్నారు. 25 క్రీడాంశాలలో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇక.. భారత్‌ నుంచి 17 మంది అథ్లెట్లతో కూడిన 35 మంది బృందం పాల్గొంటోంది. అథ్లెట్లలో ఆరుగురు పురుషులు, 11 మంది మహిళలున్నారు. ఆసియా చాంపివయన్‌షిప్ స్వర్ణ పతక విజేత, మాజీ షాట్‌పుటర్‌ ఓమ్‌ ప్రకాశ్‌ కర్హానా భారత బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా వ్యవహరిస్తున్నాడు.


2010లో యూత్‌ ఒలింపిక్స్‌ మొదలవగా..ఈసారి మాత్రమే భారత్‌ అతి తక్కువ మంది అథ్లెట్లను పంపింది. 2010లో 32మంది (8 పతకాలు), 2014లో 32 మంది (2 పతకాలు), 2018లో 46 మంది (13 పతకాలు) భారత్‌ నుంచి పాల్గొన్నారు. టీటీలో సిండ్రెలా దాస్‌, స్విమ్మింగ్‌లో ఽధినిధిదేశింఘు.. భారత జట్లలో ప్రముఖ ప్లేయర్లు. సిండ్రెలా ఇటీవలి నగోయ ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. కాగా తెలుగు క్రీడాకారుడు మంతెన శ్రేష్టరాజు ఈక్వెస్ర్టియన్‌ జంపింగ్‌ ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!

కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!

Updated Date - Oct 31 , 2026 | 01:48 AM