Share News

ఆ మిమిక్రీతో కోతులకు చెక్‌

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:32 AM

మరి కొద్దిరోజుల్లో ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 17 నుంచి 23 వరకు మెగా టోర్నమెంట్‌ జరగనుంది...

 ఆ మిమిక్రీతో కోతులకు చెక్‌

న్యూఢిల్లీ: మరి కొద్దిరోజుల్లో ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 17 నుంచి 23 వరకు మెగా టోర్నమెంట్‌ జరగనుంది. అయితే ఎంతో పాతదైన ఈ స్టేడియానికి ప్రపంచ పోటీల నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌), భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) కొత్త సొబగులు అద్దాయి. గత జనవరిలో ఈ స్టేడియంలో జరిగిన ఇండియా ఓపెన్‌ సందర్భంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా పావురాలు స్టేడియంలోకి రావడంతో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌-లో కీన్‌ యూ రెండో రౌండ్‌ మ్యాచ్‌కు రెండుసార్లు అంతరాయ మేర్పడింది. పావురాల రెట్టలతో ఏర్పడిన అపరిశుభ్రతపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇవి బాయ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. దాంతో వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు ఎలాంటి సమస్యలూ ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పక్షుల నివారణకు చర్యలు తీసుకుంది. స్టేడియం పరిసరాల్లోకి కోతులు రాకుండా ఏర్పాట్లు చేసింది. సాధారణంగా కొండముచ్చులను చూస్తే, అవి చేసే శబ్దాలు వింటే కోతులు పరారవుతాయి. ఈ నేపథ్యంలో కొండముచ్చుల అరుపులను అనుకరించే ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులను బాయ్‌ నియమించింది. అయితే బాయ్‌ చర్యపై నెటిజన్లు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.

సింధు ప్రశంస

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ విషయంపై స్పందిస్తూ నిర్వాహకుల ప్రయత్నాన్ని మెచ్చుకుంది. ‘బాయ్‌ చర్య కొందరికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ వారి ప్రయత్నాన్ని అభినందించాలి’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. సింధు పోస్టుకు నెటిజన్లు కౌంటరిచ్చారు. ‘కోతుల సంగతి పక్కనపెట్టి.. టోర్నమెంట్‌లో బాగా రాణించడంపై దృష్టి సారించు’ అని ఆగ్రహించారు. నెటిజన్ల వ్యాఖ్యలకు ఆమె బదులిస్తూ..

‘ప్రపంచ చాంపియన్‌షి్‌పలో నేను 100 శాతం ప్రదర్శన కనబరుస్తా. అయితే, బాయ్‌ ప్రయత్నాన్ని ఎందుకు తప్పుపడుతున్నారో నాకర్థం కావడం లేదు. పావురాలు రెట్టలతో పాడు చేయకుండా వింబుల్డన్‌లో కూడా డేగలను పహారాగా పెడతారు’ అని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 05:32 AM