మహిళల టీ20 ప్రపంచకప్.. పాకిస్థాన్ ముందు 171 పరుగుల లక్ష్యం..
ABN , Publish Date - Jun 14 , 2026 | 09:08 PM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 170 పరుగులు చేసి, పాక్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 170 రన్స్ చేసి, పాక్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది (India vs Pakistan Women).
భారత్ ఆరంభంలోనే షఫాలీ వర్మ (6), జెమీమా రోడ్రిగ్స్ (1) వికెట్లు కోల్పోయి 18/2తో కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36) సమయోచితంగా రాణించడంతో కోలుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34) దూకుడుగా ఆడి కీలక పరుగులు చేసింది (Women T20 World Cup 2026).
చివరకు భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. పాక్ ఎదుట 171 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది (Pakistan target 171). పాక్ బౌలర్లలో సాదియా, ఫాతిమా రెండేసి వికెట్లు పడగొట్టారు. తస్మియా, రమీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..
మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..