Share News

విశ్వజిత్‌ రజత చరిత్ర

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:33 AM

అండర్‌-23 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో రజతం సాధించిన తొలి భారత రెజ్లర్‌గా విశ్వజిత్‌ మోరే చరిత్ర సృష్టించాడు...

విశ్వజిత్‌ రజత చరిత్ర

అండర్‌-23 రెజ్లింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప

లాస్‌ వెగాస్‌ (యూఎస్‌): అండర్‌-23 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో రజతం సాధించిన తొలి భారత రెజ్లర్‌గా విశ్వజిత్‌ మోరే చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన 55 కిలోల గ్రీకో-రోమన్‌ ఫైనల్లో మోరే 12-13తో కరుమిడ్జ్‌ (జార్జియా) చేతిలో పోరాడి ఓడాడు. ఈ టోర్నీలో గతంలో రెండు కాంస్యాలు సాధించిన మోరే.. సెమీ్‌సలో 7-4తో మాలిక్‌ (రష్యా)పై గెలిచాడు. దీంతో ఈ చాంపియన్‌షి్‌పలో స్వర్ణపోరుకు చేరిన తొలి భారత రెజ్లర్‌గా రికార్డులకెక్కాడు. కాగా మహిళల్లో దీక్షా మాలిక్‌ (76 కి), కోమల్‌ (59 కి) కాంస్యం కోసం తలపడనున్నారు.

Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Updated Date - Oct 16 , 2026 | 05:33 AM