న్యూజిలాండ్ బ్యాటర్‌తో బ్రార్ వాగ్వాదం.. సర్దిచెప్పిన కోహ్లీ.. వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:37 AM
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భారత యువ బౌలర్ గర్నూర్ బ్రార్, న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సైఫెర్ట్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫెర్ట్‌ను ఔట్ చేసిన తర్వాత బ్రార్ అతడికి వీడ్కోలు పలికే క్రమంలో దూకుడుగా ప్రవర్తించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భారత యువ బౌలర్ గర్నూర్ బ్రార్, న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సైఫెర్ట్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫెర్ట్‌ను ఔట్ చేసిన తర్వాత బ్రార్ అతడికి వీడ్కోలు పలికే క్రమంలో దూకుడుగా ప్రవర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. పరిస్థితి మరింత ముదరకుండా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. బ్రార్‌ను వెనక్కి తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (Gurnoor Brar vs Tim Seifert).
భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే శుక్రవారం మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సైఫెర్ట్, విల్ యంగ్ శుభారంభం అందించారు. ముఖ్యంగా సైఫెర్ట్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు, సిక్సర్లతో వేగంగా పరుగులు సాధించాడు. బ్రార్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు బ్రార్ బౌలింగ్‌లోనే మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు (Virat Kohli viral video).
వికెట్ తీసిన ఆనందంలో గర్నూర్ బ్రార్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు (India vs New Zealand 4th ODI). పెవిలియన్‌కు వెళ్తున్న సైఫెర్ట్‌ను ఉద్దేశించి ఆవేశంగా స్పందించాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాటర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు ఎదుర్కొంటూ మాట్లాడుకోవడంతో మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ వెంటనే స్పందించాడు. బ్రార్ దగ్గరకు వెళ్లి అతడిని వెనక్కి తీసుకెళ్లాడు. గొడవ మరింత పెద్దది కాకుండా అడ్డుకున్నాడు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!
న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2