Share News

వైభవ్ సూర్యవంశీకి ఇంత కోపం వచ్చిందేంటి! వైరల్ వీడియో

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:48 PM

పాక్ ప్లేయర్‌పై వైభవ్ సూర్యవంశీ ఫైరయిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వైభవ్ సూర్యవంశీకి ఇంత కోపం వచ్చిందేంటి! వైరల్ వీడియో
Vaibhav Suryavamshi

ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ తన సత్తా చాటుతోంది. ఆదివారం జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో పాక్‌పై గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. మ్యాచ్ ఆసాంతం పాక్‌పై దూకుడు కనబరిచింది. పరిపూర్ణ విజయం అందుకుంది.

ఇక మ్యాచ్‌ మొదట్లో పాక్ బ్యాటర్లు భారత్‌పై రెచ్చిపోయేందుకు ప్రయత్నించారు. కాస్త అహం ప్రదర్శించారు. ఈ క్రమంలో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavamshi getting Angry) ఒక పాక్ ప్లేయర్‌పై ఫైరైపోయాడు. 37వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. టీమిండియా వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా పాక్ బ్యాటర్ అలీ హసన్ బలోచ్‌ వికెట్ తీశాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన వికెట్ ఇది. దీంతో టీమిండియాలో ఒక్కసారిగా సంబరం అంబరాన్ని అంటింది. ఇంతలో వైభవ్‌ సూర్యవంశీలో కోపం కట్టలు తెంచుకుంది. పాక్ బ్యాట్స్‌మన్‌ అలీ హసన్‌తో అతడు ఏదో అనడం వీడియోలో కనిపించింది. ఆ తరువాత పాక్ బ్యాటర్‌వైపు కోపంగా దూసుకెళ్లబోయాడు. ఇంతలో విహాన్ తన సంబరాన్ని పక్కనపెట్టి వైభవ్‌ను అడ్డుకుని శాంతపరిచాడు (Viral Video).


అసలు పాక్ బ్యాట్స్‌మన్ ఏమన్నాడనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో కూడా వైభవ్ పాక్ క్రికెటర్లకు చుక్కలు చూపించాడు. గతేడాది అండర్-19 ఆసియా కప్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న సూర్యవంశీతో పాక్ ప్లేయర్లు అవాకులు చవాకులు మాట్లాడారు. దీంతో, వారికి వైభవ్ దీటుగా బదులిచ్చాడు.

ఇక ఆదివారం జింబావ్వేలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తగిన రన్‌రేట్ సాధించకపోవడంతో పాక్ మ్యాచ్ ముగియకమునుపే సాంకేతికంగా టోర్నీ నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. ఆ తరువాత భారత్ గెలవడంతో అధికారికంగా పాక్ టోర్నీ నుంచి ఔట్ అయిపోయింది. ఇక బుధవారం హరారేలో జరగనున్న సెమీ ఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది.


ఇవీ చదవండి:

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

Updated Date - Feb 02 , 2026 | 07:27 PM