Share News

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు.. న్యూజిలాండ్‌పై గెలుపు..

ABN , Publish Date - Jan 24 , 2026 | 08:28 PM

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బి పోరులో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం.

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు.. న్యూజిలాండ్‌పై గెలుపు..
U19 World Cup victory

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బి పోరులో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. వర్షం కారణంగా మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 36.2 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది (Under-19 World Cup).


అనంతరం భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 130 పరుగులుగా నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని భారత్ కేవలం 13.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (53) హాఫ్ సెంచరీ సాధించాడు. వైభవ్ సూర్యవంశీ (40) మరోసారి అదరగొట్టాడు. వీరు ఔటైన తర్వాత విహాన్ మల్హోత్రా (17 నాటౌట్), వేదాంత్ త్రివేది (13 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు (India U19 hat-trick).


అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి ఒక దశలో 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది (U19 World Cup victory). అయితే కల్లమ్ శాంసన్ (37 నాటౌట్), సెల్విన్ సంజయ్ (28) పోరాడడంతో ఆమాత్రం పరుగులైనా చేయగలిగింది. భారత బౌలర్లలో అంబరీష్ (4/29), హెనిల్ పటేల్ (3/23) బంతితో సత్తా చాటారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..

Updated Date - Jan 24 , 2026 | 08:28 PM