Share News

ఇండో-నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థి నవనీత్

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:12 PM

నేపాల్‌లోని పోఖరాలో ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి 23 వరకూ జరిగిన తొలి ఇండో-నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు.

ఇండో-నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థి నవనీత్

పోఖరా, నేపాల్ (ఆంధ్రజ్యోతి): నేపాల్‌లోని పోఖరాలో ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి 23 వరకూ జరిగిన తొలి ఇండో-నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ నైపుణ్యం, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన నవనీత్.. టీమ్ ఈవెంట్‌లో ఒక స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించి సత్తా చాటాడు.


విద్యార్థి పతకాలు సాధించడంపై కోచ్ ఖాదర్ బాషా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని అభినందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన నవనీత్ విజయం అతని పాఠశాలతో పాటూ కోచ్‌లకు, తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది. యువ క్రీడాకారుడిగా అతను సాధించిన ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు స్ఫూర్తినిస్తోంది.

Updated Date - Sep 04 , 2026 | 01:13 PM