ప్చ్..కార్తీక్!
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:59 AM
కామన్వెల్త్ క్రీడల్లో రెండో రోజును భారత్ పతకాలు లేకుండా ముగించింది. శుక్రవారం అర్దరాత్రి జరిగిన పారా స్విమ్మింగ్‌లో తెలుగు కుర్రాడు బుడిగిన కార్తీక్ రవి అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లినా...
నేటి భారత షెడ్యూల్
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ -
మ. 2.30 (నిష్కా అగర్వాల్, ప్రణతి నాయక్, ఇషిత, ప్రొతిస్థ సమంత, రిద్ది శర్మ).
లాన్ బౌల్స్: మహిళల పెయిర్స్ సెక్షన్ బి - భారత్ గీ టోంగా (మ. 3.50), పురుషుల సింగిల్స్ సెక్షన్ డి- పుతుల్ సోనోవాల్ గీఇజాత్ జుల్కెప్లె (మలేసియా) (రా. 7.30).
బాక్సింగ్: పురుషుల 60 కిలోల రౌండ్-32 - సచిన్ గీ కియోమ (కెనడా) (సా. 4.00).
స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్: పురుషుల 400 మీ. ఫ్రీస్టయిల్ హీట్స్- దక్షణ్ శశికుమార్, ఆర్యన్ నెహ్రా (సా. 4 గం.) పురుషుల ఎస్14 200 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్ - చైతన్య కులకర్ణి, తేజస్ నందకుమార్ (సా. 4.40).
3 గీ3 వీల్‌చైర్ మహిళల బాస్కెట్‌బాల్ (సా. 4.30)- భారత్ గీవేల్స్.
100 మీటర్ల ఫ్రీస్టయిల్లో నాలుగో స్థానం
సెకను తేడాతో..
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో రెండో రోజును భారత్ పతకాలు లేకుండా ముగించింది. శుక్రవారం అర్దరాత్రి జరిగిన పారా స్విమ్మింగ్‌లో తెలుగు కుర్రాడు బుడిగిన కార్తీక్ రవి అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లినా.. పతకం మాత్రం అందుకోలేకపోయాడు. 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్13 విభాగంలో త్రుటిలో కాంస్యాన్ని చేజార్చుకున్నాడు. ఫైనల్స్‌లో కార్తీక్ 57.57 సెకన్లలో రేసును పూర్తిచేసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత స్విమ్మర్ ఇమామ్ అలీ ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. దక్షిణాఫ్రికా పారా స్విమ్మర్ నాథన్ హెండ్రిక్స్ (54.54 సెకన్లు) స్వర్ణం, స్టీఫెన్ క్లెగ్ (స్కాట్లాండ్, 55.16 సె) రజతం, మాథ్యూ రెడ్‌పెర్న్ (ఇంగ్లండ్, 56.86 సె) కాంస్యం దక్కించుకున్నారు. ఇక..స్విమ్మింగ్‌లో భారత్‌కు చెందిన శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. రెండుసార్లు ఒలింపియన్ నటరాజ్ సెమీఫైనల్-2 రేసును 25.29 సెకన్లలో పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచాడు. రెండు సెమీస్‌లలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన స్విమ్మర్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

బాక్సింగ్ ప్రీక్వార్టర్స్‌కు జాదూమణి: భారత బాక్సర్ జాదూమణి సింగ్ పతకం దిశగా దూసుకెళుతున్నాడు. పురుషుల 55 కిలోల విభాగం బౌట్‌లో జాదూమణి 5-0తో స్కాట్లాండ్ బాక్సర్ ఆరోన్ కల్లెన్‌ను చిత్తుచేసి ప్రీక్వార్టర్స్ చేరాడు. ఇక, పురుషుల లైట్ వెయిట్ విభాగంలో పారా లిఫ్టర్ అశోక్ మాలిక్ మొత్తం 148.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. మహిళల పారా లిఫ్టింగ్ లైట్‌వెయిట్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. గ్రూప్-బిలో జస్‌ప్రీత్ కౌర్ 100 కిలోల బరువెత్తి 96.4 పాయింట్లు సాధించింది. ఓవరాల్‌గా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

రెండో రోజూ డోపింగ్ ప్రకంపనలు
భారత జూడోకా
తులికా మాన్ సస్పెన్షన్
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత, భారత స్టార్ జూడోకా తులికా మాన్‌పైౖ సస్పెన్షన్ వేటు పడింది. దరిమిలా ఆమె గ్లాస్గో గేమ్స్‌కు దూరమైంది. డోప్ టెస్ట్‌లను నిర్వహిం చేందుకు గత 12 నెలల్లో మూడుసార్లు ప్రయత్నించగా, తన చిరునామా చెప్పడంలో తులిక విఫలమైంది. దాంతో డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ మాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) సస్పెన్షన్ విధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో తులిక రజతం నెగ్గింది. కాగా..ఈసారి క్రీడల నుంచి నిష్క్రమించిన రెండో భారత జూడోకా తులిక కావడం గమనార్హం. నిషేధిత ఉత్ర్పేరకం సేవించినట్టు తేలడంతో పురుషుల 73 కిలోల కేటగిరీలో తలపడాల్సిన అరుణ్ కుమార్‌పైనా ఇప్పటికే నాడా సస్పెన్షన్ వేటు వేసింది.
తెలుగు పారా స్విమ్మర్‌కు త్రుటిలో చేజారిన పతకం
పారా స్విమ్మింగ్‌లో ఏపీ కుర్రాడు బుడిగిన కార్తీక్ రవి పతకం నెగ్గకపోయినా కామన్వెల్త్ క్రీడల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్స్‌లో కాంస్యం నెగ్గిన మాథ్యూ కంటే కేవలం సెకను తేడాతో వెనుకంజలో నిలిచి పతకాన్ని చేజార్చుకున్నాడు. అంతకుముందు కార్తీక్ హీట్స్‌లో 57.10 సెకన్లలో గమ్యం చేరి ఫైనల్ చేరాడు. కార్తీక్ స్వస్థలం ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం.
లాన్‌బౌల్స్‌లో జోరు: మహిళల లాన్ బౌల్స్ పెయిర్స్ సెక్షన్-బిలో భారత ద్వయం రూపారాణి, పింకీ సింగ్ 2-0తో దక్షిణాఫ్రికా జోడీని ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ సెక్షన్-డిలో పుతుల్ సోనోవాల్ రెండో రౌండ్‌లోనూ విజయం సాధించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News