తన్వీ సంచలనం
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:32 AM
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 17 ఏళ్ల భారత యువ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో తన్వీ 21-12, 22-20తో...
ఆరంభ రౌండ్లో ఐదోసీడ్‌కు షాక్
సింధు, మాళవిక శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 17 ఏళ్ల భారత యువ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో తన్వీ 21-12, 22-20తో ఐదో సీడ్, ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియన్ (చైనీస్ తైపీ)పై నెగ్గి ముందంజ వేసింది. స్టార్ షట్లర్ పీవీ సింధు 21-13, 21-11తో లుసియా కాస్టిల్లో (పెరూ)పై సునాయాసంగా గెలిచింది. ఇతర సింగిల్స్ మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్ 15-21, 21-7, 21-13తో టన్‌రగ్ సహెంగ్ (థాయ్‌లాండ్)పై, ఇషారాణి 22-20, 10-21, 21-14తో హాన్ కియాస్ ఝి (చైనా)పై, తన్య 21-17, 21-18తో ఇషికా (అమెరికా)పై, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-మనీష 21-13, 21-14తో లిమ్ జైడెన్-విక్టోరియా (ఆస్ట్రేలియా)పై నెగ్గి, రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో జార్జ్, తరుణ్ మన్నెపల్లి, దయానంద్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News