Share News

సెమీస్‌ చేరి.. రికార్డుకెక్కి..

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:22 AM

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత షట్లర్‌ తన్వీ పత్రి సెమీఫైనల్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో...

సెమీస్‌ చేరి.. రికార్డుకెక్కి..

  • బ్యాడ్మింటన్‌ సెమీస్‌కు తన్వీ పత్రి

  • యూత్‌ ఒలింపిక్స్‌

డాకర్‌ (సెనెగల్‌): యూత్‌ ఒలింపిక్స్‌లో భారత షట్లర్‌ తన్వీ పత్రి సెమీఫైనల్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో తన్వీ 21-17, 21-13తో కంగ్‌క్యు కకానిక్‌(థాయ్‌లాండ్‌)పై గెలిచింది. దీంతో యూత్‌ ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా ఒడిశాకు చెందిన 15 ఏళ్ల తన్వీ రికార్డుల కెక్కింది. గతంలో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, లక్ష్య సేన్‌, ఆదిత్య జోషి పురుషుల విభాగంలో సెమీస్‌కు చేరారు. ప్రణయ్‌, లక్ష్య సేన్‌లు ఫైనల్స్‌లో ఓడి రజతాలు దక్కించుకోగా.. ఆదిత్య సెమీస్‌లోనే ఓడి పతకం లేకుండానే వెనుదిరిగాడు.

ఇవి కూడా చదవండి:

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్

సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!

Updated Date - Nov 05 , 2026 | 04:22 AM