బరిలో ప్రణయ్, ఉన్నతి
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:17 AM
తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం ఇక్కడ ప్రారంభం కానుంది. సీనియర్ షట్లర్ హెచ్‌ఎ్‌స ప్రణయ్, యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీలో తలపడుతున్నారు..
నేటినుంచి తైపీ ఓపెన్
తైపీ సిటీ: తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం ఇక్కడ ప్రారంభం కానుంది. సీనియర్ షట్లర్ హెచ్‌ఎ్‌స ప్రణయ్, యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీలో తలపడుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ ప్రణయ్ తొలి రౌండ్‌లో మినోరు కోగా (జపాన్)ను ఎదుర్కొంటాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ ఉన్నతి క్వాలిఫయర్‌ను ఢీకొననుంది. అయితే తరుణ్ మన్నేపల్లికి మొదటి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ జియోన్ హ్యోక్ (కొరియా) రూపంలో కఠిన ప్రత్యర్థి పొంచి ఉన్నాడు. ఇంకా..మంజునాథ్, దయానంద్, కిరణ్ జార్జ్, దేవికా సిహాగ్, తాన్యా హేమంత్, తస్నిమ్ మీర్, తన్వీశర్మ, శ్రియాన్షీ వలిశెట్టి, అస్మిత చలిహా, పురుషుల డబుల్స్‌లో భార్గవ్ రామ్/విశ్వతేజ, మిక్స్‌డ్‌లో ఇషాన్ భట్నాగర్/శ్రుతిమిశ్రా పోటీపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News