టీ-20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై ఒక్కసారీ గెలవని టీమిండియా..
ABN , Publish Date - Mar 08 , 2026 | 10:16 AM
చరిత్ర సృష్టించేందుకు టీమిండియా మరో అడుగు దూరంలో నిలిచింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడోసారి టీ-20 ప్రపంచకప్ అందుకున్న జట్టుగా నిలుస్తుంది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడబోతోంది.
చరిత్ర సృష్టించేందుకు టీమిండియా మరో అడుగు దూరంలో నిలిచింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడోసారి టీ-20 ప్రపంచకప్ అందుకున్న జట్టుగా నిలుస్తుంది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నీ చరిత్రలో మూడు టైటిళ్లు సాధించిన జట్టు లేదు. అలాగే వరుసగా ఏ జట్టూ రెండోసారి టైటిల్ గెలవలేదు (India vs New Zealand T20 World Cup).
టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌పై భారత్ గెలవలేదు. ఇప్పటివరకు టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో మూడు సార్లు న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడింది. వాటిల్లో ఒక్కసారి కూడా భారత జట్టు గెలవలేకపోయింది. ఇప్పుడు ఇదే అంశం టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. మరోవైపు న్యూజిలాండ్ ఇప్పటివరకు టీ-20 ప్రపంచకప్‌ను దక్కించుకోలేకపోయింది. 2021 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుని ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది ( India record vs New Zealand).
మరోవైపు టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లోపాలుండడం ఆందోళన కలిగిస్తోంది (T20 World Cup final). తుది జట్టు కూర్పు విషయంలో రకరకాల వ్యూహాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ టీ20 నెంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ, నెంబర్ వన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో ఫైనల్‌కు వీరిద్దరినీ పక్కనపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. మరి, టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచనలేంటో చూడాలి.
ఇవి కూడా చదవండి..
రూ.30 లక్షల లాటరీ.. ఎక్కడున్నాడో తెలియని విజేత.. ఏం చేస్తున్నారంటే..
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..