Share News

సెమీస్‌లో స్విటోలినా, మోన్‌ఫిల్స్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:52 AM

ఎలెనా స్విటోలినా, గైల్‌ మోన్‌ఫిల్స్‌ దంపతులు యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో అడుగు పెట్టారు. క్వార్టర్‌ ఫైనల్లో ఈ జోడీ 5-4, 4-5, 10-8తో సినియకోవా/హెన్రీ పాటన్‌ జోడీపై గెలుపొందింది.

సెమీస్‌లో స్విటోలినా, మోన్‌ఫిల్స్‌
monfils-svitloina

యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌

న్యూయార్క్‌: ఎలెనా స్విటోలినా, గైల్‌ మోన్‌ఫిల్స్‌ దంపతులు యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో అడుగు పెట్టారు. క్వార్టర్‌ ఫైనల్లో ఈ జోడీ 5-4, 4-5, 10-8తో సినియకోవా/హెన్రీ పాటన్‌ జోడీపై గెలుపొందింది. అలాగే కరోలినా ముచోవా/జాకబ్‌ మెన్సిక్‌ ద్వయం కూడా సెమీస్‌కు చేరింది. క్వార్టర్‌ఫైనల్లో ముచోవా జోడీ 4-1, 5-3తో ఎమ్మా నవారో/టామీ పాల్‌ జంటను ఓడించింది. ఇక..సెరెనా విలియమ్స్‌/కార్లోస్‌ అల్కారజ్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లో 4-5, 1-4తో బెలిండా బెన్సిక్‌/కొబోలి చేతిలో పరాజయం చవిచూసింది. రుబ్లేవ్‌/ఆండ్రీవా జంట 4-1, 4-5, 10-5తో రూడ్‌/ష్నైడిర్‌ జోడీపై విజయంతో సెమీఫైనల్‌కు చేరింది. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు గురువారం జరుగుతాయి.



ఇవి కూడా చదవండి:

27 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. తాను చదువుకున్న స్కూలే కారణమంటూ..

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: శ్రీలంకతో రెండో టెస్టు డ్రా అయితే.. భారత్ పరిస్థితేంటి?

Updated Date - Aug 27 , 2026 | 04:52 AM