AUS vs BAN: బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:05 PM
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టును ఆస్ట్రేలియా రోజున్నర వ్యవధిలోనే ముగించింది. మాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. మాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తమతో వ్యవహారం ఆషామాషీగా ఉండదని మరోసారి నిరూపించింది. తొలి టెస్టులో సంచలన విజయం నమోదు చేసిన బంగ్లా జట్టుకు అసలైన సవాల్ ఎలా ఉంటుందో కంగారు జట్టు రుచి చూపించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ కేవలం రెండో రోజు సెకండ్ సెషన్‌లోనే ముగియడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 64 పరుగులకే ఆలౌట్ చేసింది ఆసీస్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ బుల్లెట్ లాంటి బంతులు విసిరి 95 పరుగులకే కుప్పకూల్చారు. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు సాధించిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు సాధించి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 210 పరుగులు చేసింది. దీంతో బంగ్లాపై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరు వికెట్లు తీశాడు. నాథన్ లయన్ 3, జోష్ హేజిల్‌వుడ్ ఒక వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను మిచెల్ స్టార్క్ అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలోకి సారాంశ్.. అరంగేట్రంతోనే అరుదైన రికార్డు!
రాహుల్‍ను వైస్ కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం కాదు: మాజీ క్రికెటర్