Share News

చెలరేగిన ముల్డర్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:03 AM

ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్డర్‌ (7/31) విజృంభించడంతో.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌...

చెలరేగిన ముల్డర్‌

  • రెండో టెస్ట్‌లో బంగ్లా చిత్తు

  • 2-0తో దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్

సెంచూరియన్‌: ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్డర్‌ (7/31) విజృంభించడంతో.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన సౌతాఫ్రికా రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 403 పరుగు ల లోటుతో.. బుధవారం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 184 రన్స్‌కే కుప్పకూలింది. లంచ్‌ సమయానికి 109/3తో నిలిచిన బంగ్లా ముల్డర్‌ దెబ్బకు 75 పరుగులకే మి గిలిన 7వికెట్లు చేజార్చుకొంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 91 రన్స్‌చేయగా.. దక్షిణాఫ్రికా 494/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 03:03 AM