చాంపియన్ల ముందంజ
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:34 AM
పురుషుల డబుల్ డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ)ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముందంజ వేశాడు. అలాగే మహిళల డిఫెండింగ్ చాంప్ మాడిసన్ కీస్ కూడా శుభారంభం చేసింది. మంగళవారం...
రెండోరౌండ్‌కు సినర్, కీస్
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: పురుషుల డబుల్ డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ)ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముందంజ వేశాడు. అలాగే మహిళల డిఫెండింగ్ చాంప్ మాడిసన్ కీస్ కూడా శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్ ఆరంభ రౌండ్లో సినర్ 6-2, 6-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి హ్యూగో గాస్టన్ (ఫ్రాన్స్)వాకోవర్ ప్రకటించాడు. దీంతో సినర్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మరోవైపు, తనకిదే చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అని ప్రకటించిన మోన్‌ఫిల్స్. స్థానిక క్వాలిఫయర్ డేన్ స్వీనీ చేతిలో ఓటమి తప్పలేదు. మిగతా టాప్ ఆటగాళ్లలో 5వ సీడ్ ముసెట్టి, 9వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్, 8వ సీడ్ బెన్ షెల్టన్, 15వ సీడ్ ఖచనోవ్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంప్, 9వ సీడ్ మాడిసన్ కీస్ 7-6 (6), 6-1తో ఉక్రెయిన్‌కు చెందిన ఒలిన్‌కోవాపై, 5వ సీడ్ రిబకినా 6-4, 6-3తో జువాన్‌పై, 10వ సీడ్ బెన్‌సిచ్ 6-0, 7-5తో బౌల్టర్‌పై, మాజీ చాంపియన్ నవోమి ఒసాకా 6-3, 3-6, 6-4తో రూజిక్ (క్రొయేషియా)పై, ఓస్టాపెంకో 6-4, 6-4తో స్రామ్‌కోవాపై గెలిచి రెండోరౌండ్ చేరారు.
డబుల్స్‌లో నిక్కీకి నిరాశ..: పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన భారత ఆటగాడు నిక్కీ పూనాచకు నిరాశే ఎదురైంది. డబుల్స్ తొలి రౌండ్లో నిక్కీ/ప్రూచ్యా ఇసారో (థాయ్‌లాండ్) జోడీ స్పెయిన్ జంట మార్టినెజ్/మునార్ చేతిలో ఓటమిపాలైంది.
బసవారెడ్డి బోణీ అదిరింది..
అమెరికా తరఫున ఆడుతున్న తెలుగు సంతతి ఆటగాడు నిశేష్ బసవారెడ్డి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. నాలుగు గంటలా 11 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో క్వా లిఫయర్ బసవారెడ్డి 4-6, 7-6(7), 6-7(3), 6-2, 6-3తో స్థానిక ఆటగాడు, 31 ఏళ్ల క్రిస్ ఓ కానెల్‌పై నెగ్గాడు. బసవారెడ్డి తల్లిదండ్రులు మురళీ రెడ్డి, ప్రసన్న అమెరికాలో స్థిరపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News