ప్రణయ్ ఇంటికి..తరుణ్ ముందుకు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:33 AM
ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు...
ఐదో సీడ్‌కు కృష్ణప్రసాద్ జోడీ షాక్ ఫ ఆర్కిటిక్ ఓపెన్
వంతా (ఫిన్లాండ్): ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో 34 ఏళ్ల ప్రణయ్ 10-21, 9-21తో నాలుగో సీడ్ డేన్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తెలుగు కుర్రాడు తరుణ్ మన్నేపల్లి శుభారంభం చేశాడు. సింగిల్స్‌లో తరుణ్ 21-16, 21-14తో మా గ్నస్ జొహాన్నెసెన్ (డెన్మార్క్)పై నెగ్గి రెండో రౌండ్ చేరాడు. పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్ గరగ/పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జంట 10-21, 21-18, 22- 20తో చైనాకు చెందిన ఐదో సీడ్ ద్వయం హె జి తింగ/రెన్ గ్జియాంగ్ యును చిత్తుచేసి రెండో రౌండ్లో ప్రవేశించింది.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి