సెరెనా రీఎంట్రీ అదిరింది!
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:30 AM
దాదాపు నాలుగేళ్ల అనంతరం రాకెట్ పట్టినా, తన ఆటలో ఏమాత్రం పవర్ తగ్గలేదని నిరూపించింది టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షి్‌పలో 19 ఏళ్ల టీనేజర్...
డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు
క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్
లండన్: దాదాపు నాలుగేళ్ల అనంతరం రాకెట్ పట్టినా, తన ఆటలో ఏమాత్రం పవర్ తగ్గలేదని నిరూపించింది టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షి్‌పలో 19 ఏళ్ల టీనేజర్ విక్టోరియా బొకో (కెనడా)తో కలిసి డబుల్స్ బరిలోకి దిగిన 44 ఏళ్ల సెరెనా.. క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెరెనా/విక్టోరియా జోడీ 7-6(2), 6-2తో మూడోసీడ్ ద్వయం నికోల్ మెలిచార్ (అమెరికా)/ఎరిన్ రాట్లి్‌ఫను ఓడించింది. 2002 యూఎస్ ఓపెన్‌తో కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన 44 ఏళ్ల సెరెనా..ఆ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ బరిలో దిగడం ఇదే మొదటిసారి. సెమీఫైనల్ బెర్త్ కోసం లైలా ఫెర్నాండెజ్ (కెనడా)/లారా సిగ్మండ్ (జర్మనీ) జంటతో సెరెనా/విక్టోరియా ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News