వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడగలడా.. సచిన్ టెండూల్కర్ అభిప్రాయం ఏంటంటే..
ABN , Publish Date - May 31 , 2026 | 11:41 AM
తాజా ఐపీఎల్‌లో అదరగొట్టిన పదిహేనేళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడగలడా? ఫోర్లు, సిక్స్‌లతో దుమ్మురేపే వైభవ్.. నెమ్మదైన ఆటలో మెప్పించగలడా? ఈ ప్రశ్నలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సమాధానం చెప్పాడు.
తాజా ఐపీఎల్‌లో అదరగొట్టిన పదిహేనేళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడగలడా? ఫోర్లు, సిక్స్‌లతో దుమ్మురేపే వైభవ్.. నెమ్మదైన ఆటలో మెప్పించగలడా? ఈ ప్రశ్నలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సమాధానం చెప్పాడు. ఫార్మాట్ ఏదైనా తనకు నచ్చిన రీతిలో ఆడే స్వేచ్ఛ వైభవ్‌కు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు (Vaibhav Sooryavanshi Test Cricket).
'టెస్ట్ క్రికెట్ అంటే కేవలం రక్షణాత్మక ధోరణితో ఆడే ఆట కాదు. పరిస్థితులకు అనుగుణంగా దూకుడుగా కూడా ఆడాల్సి ఉంటుంది. వైభవ్ షాట్ సెలక్షన్, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం, బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే ధైర్యం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. వైభవ్‌కు తన సహజ ఆట ఆడే స్వేచ్ఛ ఇవ్వాలి. అదే అతడి బలం. ఆ స్వేచ్ఛ కొనసాగితే టెస్ట్ క్రికెట్‌లో కూడా అతడు విజయవంతం అవుతాడు' అని సచిన్ పేర్కొన్నాడు (Sachin Tendulkar about Vaibhav Sooryavanshi).
'వైభవ్ చాలా స్పెషల్ ప్లేయర్. అతడు మణికట్టును వాడే విధానం బాగుంది. అతడు కేవలం బంతిని బాదడమే కాదు. బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను ముందుగానే పసిగట్టి మైదానం నలువైపులా షాట్లు కొట్టాడు. అతడు టెస్ట్ క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నా. టెస్ట్ క్రికెట్‌లో వివిధ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. ఫార్మాట్ ఏదైనా అతడు స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాలి' అని సచిన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..