Share News

ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్‌

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:53 AM

సూపర్‌ఫామ్‌లో ఉన్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వారంలోపే రెండో టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నర్‌పగా నిలిచిన ఈ తెలుగు షట్లర్‌ తాజాగా...

ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్‌

హైలో ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

సార్‌బ్రూకెన్‌ (జర్మనీ): సూపర్‌ఫామ్‌లో ఉన్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వారంలోపే రెండో టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నర్‌పగా నిలిచిన ఈ తెలుగు షట్లర్‌ తాజాగా హైలో ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో టైటిల్‌ ఫైట్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ సింధు 21-13, 21-16తో భారత్‌కే చెందిన యువ షట్లర్‌ అన్మోల్‌ ఖర్బ్‌ను వరుస గేముల్లో ఓడించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సింధు కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఆదివారం జరిగే తుది పోరులో డెన్మార్క్‌ షట్లర్‌, 8వ సీడ్‌ లినె హాజ్‌మార్క్‌ జేర్‌ఫెల్ట్‌తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీ్‌సలో హాజ్‌మార్క్‌ 8-21, 21-19, 28-26తో టాప్‌సీడ్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)ను కంగుతినిపించింది. ఇక, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఫైనల్‌ చేరి భారత అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్‌ లక్ష్యసేన్‌ 21-17, 21-13తో ఫ్రాన్స్‌కు చెందిన ఆరో సీడ్‌ టోమా జూనియర్‌ పొపోవ్‌ను చిత్తు చేశాడు. టాప్‌సీడ్‌ ఆండ్రెస్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌), నాలుగో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో లక్ష్యసేన్‌ ఫైనల్లో తలపడతాడు.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Nov 01 , 2026 | 03:54 AM