Share News

ఛాంపియన్స్ లీగ్ విజయోత్సవాల్లో హింస.. 130 మంది అరెస్ట్..

ABN , Publish Date - May 31 , 2026 | 10:35 AM

ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ విజయోత్సవాలు పారిస్‌లో హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌లో అర్సెనాల్ జట్టుపై పారిస్ సెయింట్- జర్మన్ (PSG) టీమ్ విజయం సాధించింది. దీంతో ఆ టీమ్ అభిమానుల సంబరాలు పారిస్ నగరంలో హింసాత్మకంగా మారాయి.

ఛాంపియన్స్ లీగ్ విజయోత్సవాల్లో హింస.. 130 మంది అరెస్ట్..
PSG Champions League

ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ విజయోత్సవాలు పారిస్‌లో హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌లో అర్సెనాల్ జట్టుపై పారిస్ సెయింట్- జర్మన్ (PSG) టీమ్ విజయం సాధించింది. దీంతో ఆ టీమ్ అభిమానుల సంబరాలు పారిస్ నగరంలో హింసాత్మకంగా మారాయి. ఆకతాయిలు పలు కార్లు, దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు దాదాపు 130 మందిని అరెస్ట్ చేశారు (PSG Champions League).


బుడాపెస్ట్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పీఎస్‌జీ విజేతగా నిలిచి వరుసగా రెండో సారి టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పారిస్ నగరంలో పలు చోట్ల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌ను భారీ తెరలపై వీక్షించేందుకు పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియానికి 40 వేల మందికి పైగా చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ విజయం సాధించగానే అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది (PSG Fans Violence).


అభిమానులు గుంపులుగా చేరి బాణాసంచా కాల్చారు. తెరలకు నిప్పంటించారు (Champions League Final 2026). కనిపించిన కార్లను, దుకాణాలను ధ్వంసం చేశారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒక పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి జరిగింది. ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 130 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..


బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 31 , 2026 | 10:40 AM