Share News

ఒలింపిక్స్‌ నిర్వహిస్తాం ప్రధాని నరేంద్ర మోదీ

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:03 AM

ఇటీవలి ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇక్కడి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో...

ఒలింపిక్స్‌ నిర్వహిస్తాం ప్రధాని నరేంద్ర మోదీ

ఆసియాడ్‌ పతక విజేతలతో భేటీ

న్యూఢిల్లీ : ఇటీవలి ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇక్కడి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో గురువారం జరిగిన కార్యక్రమం లో క్రికెట్‌లో స్వర్ణ పతకాలు గెలుపొందిన భారత పురుషులు, మహిళల జట్లు కూడా పాల్గొన్నా యి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వగల వేదికగా భారత్‌ ఎదుగుతోంది. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు బిడ్‌ వేస్తున్నాం. ఆ క్రీడలను నిర్వహించాలన్నది మా సంకల్పం’ అని ఆయన నొక్కి చెప్పారు. ‘మీరు 140 మంది కోట్ల భారతీయులకు గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం కేవలం మీదేకాదు కోట్లాదిమంది దేశ ప్రజలది. వారి తరపున మీకు అభినందనలు’ అని మోదీ అన్నారు. విజేతలతో కలిసి ప్రధాని ఫొటోలకు పోజులిచ్చారు. పతక విజేతలు తమ సంతకాలతో కూడి జెర్సీలను ప్రధానికి అందించారు. 17 ఏళ్ల రికర్వ్‌ ఆర్చరీ సంచలనం కుమ్‌కుమ్‌ మొహోద్‌ మోదీకి విల్లును ప్రదానం చేసింది. అథ్లెట్లతోపాటు ఆయా క్రీడా సంఘాలు, సమాఖ్యల ఉన్నతాధికారులు, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, ఐసీసీ చైర్మన్‌ జైషా పాల్గొన్నారు.

Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Updated Date - Oct 16 , 2026 | 06:03 AM