Share News

అర్జెంటీనాను తప్పించాలి!

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:26 AM

డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా చుట్టూ రేగుతున్న వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడడం లేదు. తాజాగా ఆ జట్టును వరల్డ్‌కప్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఓ ఆన్‌లైన్‌ పిటిషన్‌ చక్కర్లు కొడుతున్నట్టు...

అర్జెంటీనాను తప్పించాలి!

ఆన్‌లైన్‌ పిటిషన్‌ హల్‌చల్‌

కుట్ర అంటున్న ఫ్యాన్స్‌

న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా చుట్టూ రేగుతున్న వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడడం లేదు. తాజాగా ఆ జట్టును వరల్డ్‌కప్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఓ ఆన్‌లైన్‌ పిటిషన్‌ చక్కర్లు కొడుతున్నట్టు చైనా పత్రిక తెలిపింది. అయితే, మెస్సీ సేన నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర అని ఆ టీమ్‌ అభిమానులు తిప్పికొడుతున్నారు. కాగా, రెఫరీలు మెస్సీ అండ్‌ కోకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఈజి్‌ప్టతో జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా పట్ల రెఫరీలు పక్షపాత నిర్ణయాలు తీసుకొన్నారని, ఆ జట్టుకే టైటిల్‌ ఇవ్వాలని ఫిఫా ఫిక్సయిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ‘అర్జెంటీనాఅవుట్‌.కామ్‌’ వెబ్‌సైట్‌లో అవుట్‌ అర్జెంటీనా అనే పిటిషన్‌ను ఉంచారు. అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఓటేయాలనే ఒక్క ఆప్షన్‌ మాత్రమే ఉండడం గమనార్హం. కొన్ని సెకన్లు మాత్రమే ఇది కనిపించి.. మరో సైట్‌కు రీడైరెక్ట్‌ అవుతోంది. బుధవారం రాత్రి వరకు కోటి మందికిపైనే ఇందులో సంతకాలు చేసినట్టు కనిపిస్తోంది. ఈ పిటిషన్‌ను ఎవరు సర్క్యులేట్‌ చేస్తున్నారనే అధీకృత సమాచారం కూడా లేదు. ‘మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనాకు రెఫరీలు అనుకూలంగా మారిపోయారు. విజేత ఎవరో ముందే నిర్ణయిస్తే.. మిగతా జట్లు ఎందుకు పోటీపడాలి? అందుకే అర్జెంటీనాను టోర్నీ నుంచి తప్పించాలి. అన్ని జట్లకూ సమాన అవకాశాలివ్వాల’ని వెబ్‌సైట్‌ పోస్టులో ఉంది.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:26 AM